శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2023 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో నిన్న (నవంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులకే కుప్పకూలిన లంకేయులు.. వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన ఐసీసీ ఫుల్ టైమ్ జట్టుగా (టెస్ట్ హోదా కలిగిన జట్టు) అపఖ్యాతిని మూటగట్టుకున్నారు.
ఈ చెత్త రికార్డు గతంలో బంగ్లాదేశ్ పేరిట ఉండేది. 2011 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 58 పరుగులకే ఆలౌటైంది. దీనికి ముందు 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 74 పరుగులకే చాపచుట్టేసింది. అయితే ఆ వరల్డ్‌కప్‌లో పాక్ ఛాంపియన్‌గా నిలవడం విశేషం.
ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment