
సాక్షి: ఐసీసీ మెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్– 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన ను కనబరిచింది.
జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడంతో ఈసారి ప్రపంచ విజేతగా రోహిత్ సేన నిలుస్తుందని సగటు క్రికెట్ అభిమాని ఆశిస్తున్నా రు. ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. పలు హోటళ్లు, టీసెంటర్స్, బార్లు, రెస్టారెంట్లలో అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. పలువురు అభిమానులు ప్రపంచకప్ న మూనాను తలపై కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నా రు. క్రికెట్ వరల్డ్‌కప్ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు..
Comments
Please login to add a commentAdd a comment