వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. తమ కంటే ఎంతో బలంగా ఉన్న సౌతాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ మట్టికరిపించి అందరికీ షాక్ ఇచ్చింది. మొత్తం 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాపై 38 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది నెదర్లాండ్స్ జట్టు.
One of the greatest ICC Men's Cricket World Cup upsets of all time in Dharamsala as Netherlands overcome South Africa 🎇#SAvNED 📝: https://t.co/gLgies5ZBv pic.twitter.com/KcbZ10qdAG
— ICC Cricket World Cup (@cricketworldcup) October 17, 2023
246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు డచ్ బౌలర్లు చుక్కలు చూపారు. కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టును కష్టాల్లోకి నెట్టారు. వర్శం కారణంగా ఈ మ్యాచ్‌ను 43 ఓవర్లకే కుదించారు.
స్కోర్లు: నెదర్లాండ్స్ 245-8 (43), దక్షిణాఫ్రికా 207 (42.5)
Comments
Please login to add a commentAdd a comment