రోమ్: జీ-7 సదస్సు జరుగుతున్న వేళ ఇటలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పార్లమెంట్‌లోని దిగువ సభలో చట్ట సభ్యులు(ఎంపీలు) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. ఇటలీ పార్లమెంట్‌లో సభ్యులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం కారణంగా దాడి జరిగింది. చట్టసభలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సభలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతిపక్ష సభ్యుడిని వీల్ చైర్‌లో ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
ITALIAN PARLIAMENT: A fight breaks when Five Star Movement deputy Leonardo Donno unfurls an Italian flag in protest against plans to grant more autonomy from Rome to regions that want it. Protestors argue that it undermines Italy's unity. pic.twitter.com/qf6bVFteC3
— Mark Alan Pearce (@PearceAlan1962) June 13, 2024
కాగా, వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ఇటలీ రాజకీయ నేతలు స్పందించారు. ఇది ఇటలీ ఐకత్యను దెబ్బతిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment