
సాక్షి, న్యూఢిల్లీ : 'ఇదొక పెద్ద విజయం. ఇప్పుడు మనం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం' అని ప్రధాని నరేంద్రమోదీ తన పార్టీ సీనియర్ నేతలతో అన్నారు. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ముందుగా పార్టీ నేతలందరికీ నమస్కరించారు. '1980లో మనవి రెండు సీట్లు. ఇప్పుడు ఏకంగా 19 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. ఇది పెద్ద విజయం. ఆఖరికి ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పడు కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఈ ఆనందంతో ఎవరూ అతిగా ఉప్పొంగవద్దు' అని సూచించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment