రాష్ట్రపతితో ముగిసిన తెలంగాణ ఎంపీల భేటీ | Telanagana MPs met President Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో ముగిసిన తెలంగాణ ఎంపీల భేటీ

Published Tue, Jul 8 2014 9:48 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

Telanagana MPs met President Pranab Mukherjee

న్యూఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ప్రాంత ఎంపీలు అన్నారు. రాష్ట్రపతి అనుమతి, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఏకపక్షంగా బిల్లు పెట్టడం అసమంజసమన్నారు. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని తెలిపేందుకు  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో తెలంగాణ ఎంపీలు భేటి అయ్యారు. ఈ భేటికి 11 మంది టీఆర్ఎస్ ఎంపీలతోపాటు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరయ్యారు. 
 
ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేశారు. గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారం ఇవ్వడం రాష్ట్రాల హక్కును హరించడమేనని టి.ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఈ రెండు అంశాలను రాష్ట్రపతికి వివరించామని, ఈ అంశాల్లో న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని తెలంగాణ ఎంపీలు స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement