చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబర్ 17న నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించనున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం హర్యానాలోని పంచకుల సెక్టార్ 5లోని పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అక్టోబరు 17న పంచకులలో సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రధాని ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
త్వరలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని, అందులో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది. నయాబ్ సింగ్ సైనీని ఎమ్మెల్యేలు అధికారికంగా తమ నేతగా ఎన్నుకోనున్నారని సమాచారం. తాము మళ్లీ అధికారంలోకి వస్తే నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది.
ఇటీవల నయాబ్ సింగ్ సైనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ సీనియర్ నేతలను కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
#WATCH | Union Minister & former Haryana CM Manohar Lal Khattar says, "We have received the nod of the PM that on October 17, in Panchkula, the CM and council of ministers will take oath." pic.twitter.com/SLxvKGPWSq
— ANI (@ANI) October 12, 2024
ఇది కూడా చదవండి: ‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’
Comments
Please login to add a commentAdd a comment