లిప్‌స్టిక్‌లో రహస్య కెమెరాలు | Cameras In Lipstick,Goggles Used To Film Victims | Sakshi
Sakshi News home page

లిప్‌స్టిక్‌లో రహస్య కెమెరాలు

Published Mon, Sep 30 2019 4:05 AM | Last Updated on Mon, Sep 30 2019 2:55 PM

Cameras In Lipstick,Goggles Used To Film Victims - Sakshi

నిందితులను తరలిస్తున్న పోలీసులు (ఫైల్‌)

భోపాల్‌: సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌ హనీ ట్రాప్‌ సెక్స్‌ స్కాంలో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. లిప్‌స్టిక్‌ల్లో, కళ్లద్దాల్లో రహస్యంగా దాచిన కెమెరాల ద్వారా రాసలీలలను చిత్రీకరించారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి పదుల సంఖ్యలో స్పై కెమెరాలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఒక యువతితో ఓ హోటల్‌ గదిలో చేస్తున్న రాసలీలల వీడియో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఓ హిందుత్వ సంస్థకు చెందిన నాయకుడికి సన్నిహితుడైన ఓ పెద్దాయనకు సంబంధించిన మరో వీడియో కూడా హల్‌ చల్‌ చేస్తోంది. అయితే, అవి నిజమైనవా? కావా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ స్కామ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అవి చాలావరకు నకిలీవని తెలుస్తోంది. కొందరు మహిళలు మధ్యతరగతి కాలేజీ అమ్మాయిలను ఎర వేసి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో పనులు చేయించుకుని కోట్లు సంపాదించిన స్కామ్‌ ఒకటి తాజాగా మధ్యప్రదేశ్‌ లో వెలుగు చూసిన విషయం తెలిసిందే.

అదే సమయంలో వారు ఆ యువతులతో ఉన్న సమయంలో వీడియోలు తీసి, బ్లాక్‌ మెయిల్‌ చేయడం ద్వారానూ పనులు చేయించుకునేవారు. ఓ సీనియర్‌ ఇంజినీర్‌ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఆర్తి దయాల్, మోనిక యాదవ్, శ్వేత విజయ్‌ జైన్, శ్వేత స్వప్నిల్‌ జైన్, బర్ఖా సోని, ఓం ప్రకాశ్‌ కోరిలను సిట్‌ అరెస్ట్‌ చేసింది. నిందితుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, మాజీ మంత్రుల శృంగారాలున్న వీడియో, ఆడియో క్లిప్‌లను వేలాదిగా సిట్‌ స్వాధీనం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement