Bride marries sister's groom: ఇటీవల కాలంలో వివాహాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వధువు వరుడుకి సర్‌ప్రైజ్ ఇచ్చేలా డ్యాన్స్‌లు చేయడం వంటివి ఇటీవల పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఇదంతా ఒకత్తైయితే ఒకేసారి వివాహం చేసుకుంటున్నామని ఆనందంగా ఉన్న ఈ అక్కాచెల్లెళ్లకు ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది.
వివరాల్లోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రమేష్ లాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులతో వివాహం నిశ్చయించాడు. ఈ మేరకు రమేష్ తన కుమార్తెలిద్దరికి ఒకేసారి వివాహం నిర్వహించాడు. ఐతే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కరెంట్ పోయింది. అదీగాక వధువరులు మేలి ముసుగు ధరించి ఉన్నారు. పైగా ఒకేరకమైన పెళ్లి దుస్తులు ధరించడంతో ముహుర్త ఘట్టం వద్దకు వచ్చే వరకు కూడా అక్కడున్న బంధువులెవరికీ ఎవరూ ఎవర్నీ పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాలేదు.
అయితే ఇంతలో వివాహతంతు కూడా ముగిసిపోయింది. ఆయా జంటలకు కూడా తమ తమ ఇంటికి చేరుకునేవరకు తాము ఎవర్ని పెళ్లి చేసుకున్నాం అనేది తెలియకపోవడం విచిత్రం. పాపం ఆయా కుటుంబాల వాళ్లు కూడా వధువరులు మారిపోయారనే విషయాన్ని వివాహతంతు ముగిసిపోయే వరకు గుర్తించలేదు. దీంతో కాసేపు ఆయా కుటుంబాల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఐతే ఆయా జంటలు మరోసారి వివాహం జరిపించాలని పెద్దలను కోరడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment