grooms
-
మార్కెట్లో పెళ్లి కొడుకుల విక్రయం.. ఎక్కడో కాదు మన దేశంలోనే!
పట్నా: పెళ్లైన కొత్తలో మూవీలో హైటెక్ మ్యారేజ్ బ్యూరో పేరుతో సునీల్ పెళ్లికొడుకులను విక్రయానికి పెడతాడు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసినట్లు పెళ్లి కొడుకులను కొనుగోలు చేయటం వింటే వింతగా ఉంది కదా?. అయితే.. అలాంటి మార్కెట్ ఒకటి నిజ జీవితంలో ఉందని మీకు తెలుసా? బిహార్‌లోని మధుబని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలోని చెట్ల కిందే ప్రతిఏటా 9 రోజుల పాటు ఈ పెళ్లి కొడుకుల విక్రయాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 700 ఏళ్ల నుంచి వస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు తమ కుమార్తెలను తీసుకుని ఈ మార్కెట్‌కు వస్తారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మార్కెట్లో వేల మంది పెళ్లి కొడుకులు వారి కుటుంబ సభ్యులతో వస్తారు. సంప్రదాయ ధోతి, కుర్తా లేదా షీన్స్, టీషర్ట్ ధరిస్తారు. వారి ఆస్తులు, విద్యా అర్హతలను బట్టి వారికి రేటు నిర్ణయిస్తారు. పెళ్లి కొడుకును కొనుగోలు చేసే ముందు అతడి అర్హతలు, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తారు ఆడపిల్లల కుటుంబ సభ్యులు. అలాగే జన్మదినం, పాఠశాల ధ్రువపత్రాల వంటివి అడుగుతారు. వరుడిని వధువు ఎంపిక చేసుకున్న తర్వాత ఇరువురి కుటుంబాలు మిగతా కార్యక్రమాలు చేపడతాయి. వివాహాన్ని ఆడపిల్ల కుటుంబమే నిర్వహిస్తుంది. కర్నాత్ వంశపాలన కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విభిన్న గోత్రాల ప్రజల మధ్య పెళ్లిళ్లు చేసేందుకు రాజా హరిసింగ్ దీనిని ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు.. వివాహాలు కట్నం లేకుండా చేయటమే దీని లక్ష్యంగా మరికొందరు తెలిపారు. Groom market’ In this unique 700-year-old tradition, the aspiring husbands stand in public display, Village famous for its ” annual “groom market” in India’s Bihar state -in Madhubani district Dowry though illegal in India, is prevalent and has a high social acceptance pic.twitter.com/G5428fE2Kz — Elmi Farah Boodhari (@BoodhariFarah) August 4, 2022 ఇదీ చదవండి: కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు -
వధువు చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు... షాక్‌లో బంధువులు
Bride marries sister's groom: ఇటీవల కాలంలో వివాహాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వధువు వరుడుకి సర్ప్రైజ్ ఇచ్చేలా డ్యాన్స్‌లు చేయడం వంటివి ఇటీవల పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఇదంతా ఒకత్తైయితే ఒకేసారి వివాహం చేసుకుంటున్నామని ఆనందంగా ఉన్న ఈ అక్కాచెల్లెళ్లకు ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రమేష్ లాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులతో వివాహం నిశ్చయించాడు. ఈ మేరకు రమేష్ తన కుమార్తెలిద్దరికి ఒకేసారి వివాహం నిర్వహించాడు. ఐతే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కరెంట్ పోయింది. అదీగాక వధువరులు మేలి ముసుగు ధరించి ఉన్నారు. పైగా ఒకేరకమైన పెళ్లి దుస్తులు ధరించడంతో ముహుర్త ఘట్టం వద్దకు వచ్చే వరకు కూడా అక్కడున్న బంధువులెవరికీ ఎవరూ ఎవర్నీ పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాలేదు. అయితే ఇంతలో వివాహతంతు కూడా ముగిసిపోయింది. ఆయా జంటలకు కూడా తమ తమ ఇంటికి చేరుకునేవరకు తాము ఎవర్ని పెళ్లి చేసుకున్నాం అనేది తెలియకపోవడం విచిత్రం. పాపం ఆయా కుటుంబాల వాళ్లు కూడా వధువరులు మారిపోయారనే విషయాన్ని వివాహతంతు ముగిసిపోయే వరకు గుర్తించలేదు. దీంతో కాసేపు ఆయా కుటుంబాల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఐతే ఆయా జంటలు మరోసారి వివాహం జరిపించాలని పెద్దలను కోరడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. (చదవండి: పారిపోతూ.. విధి నుంచి తప్పించుకోలేకపోయాడు) -
పెండ్లి రోజు పార్టీ.. నవ వరుడు హత్య
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): విల్లియనూరులో ప్రజలకు ఇబ్బందికరంగా పెండ్లి రోజు పార్టీని జరుపుకుంటున్న వారిని ప్రశ్నించడంతో.. మద్యం మత్తులో ఉన్నవారు నవ వరుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. వివరాలు.. పుదుచ్చేరి రాష్ట్రం విలియనూరు మూర్తినగర్‌కు చెందిన సతీష్ అలియాస్ మణిగండన్ (28). ఇతను ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఇటీవల మదివదన (25)తో వివాహమైంది. శనివారం రాత్రి అతను ఇంటికి ఎదురుగా ఉండే శంకర్ (32) అతని భార్య రమణి (28) వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీధిలో కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో రమణి తమ్ముడు రాజా, అతని స్నేహితుడైన తెన్నెల్ ప్రాంతానికి చెందిన అజార్ సామియర్ తోపుకు తమిళ్ సెల్వన్ మద్యం మత్తులో వీరంగం సృష్టించినట్లు తెలిసింది. దీంతో వారిని స్థానికులు సతీష్, శబరి, హరి, రాజా ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో రాజా, శంకర్, అజార్, తమిళ్ సెల్వన్, సతీష్‌ను కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి.. ఆపాలంటూ పోలీసుల ఎంట్రీ
పట్నా: కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టనుండగా.. ఇంతలో ఓ యువతి పెళ్లి ఆపాలంటూ పోలీసులతో ఎంట్రీ ఇచ్చింది. దీంతో పెళ్లి ఆగిపోవడంతో పాటు వరుడిని కూడా మార్చాల్సి వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పట్నాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పెళ్లి కొడుకు (అనిల్ కుమార్) పాలిగంజ్ సబ్ డివిజన్ లోని సియరాంపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలోని మురార్చక్ గ్రామంలో నివసిస్తున్న కుమారి పింకీ అనే యువతితో ఈ నెల 15న పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనంగా ఓ యువతి పోలీసులతో మంటపంలోకి రంగప్రవేశం చేసింది. ఆ యువతి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ( కుమార్) ఒక సంవత్సరం క్రితం తనని వివాహం చేసుకున్నాడని, వారు భార్యాభర్తలుగా రహస్యంగా కలిసి జీవిస్తున్నారని తెలిపింది. అయితే, అతను తన తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహానికి అంగీకరించాడని చెప్పింది. తన భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు తెలియగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలను ఫోటోలతో సహా చూపించిన్నట్లు పేర్కొంది. దీంతో పెళ్లి ఆగిపోగా.. ఇక చేసేదేమి లేక మరుసటి రోజు ఉదయం వరుడి తమ్ముడితో వివాహం జరిపించారు. చదవండి: వైరల్: వధువు నోరు, ముక్కు నుంచి పొగ! -
నయా మోసం: ఒక వధువు, ఐదుగురు పెళ్లి కుమారులు!
భోపాల్: పెళ్లి పేరిట ముగ్గురు కలిసి ఐదుగురిని మోసం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఒక వరుడు పెళ్లి చేసుకుందామని మండపానికి వెళ్లగా షాక్ తగిలింది. పెళ్లి కుమార్తె కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సదరు వరుడు నేరుగా పోలీస్‌స్టేషన్ చేరగా అక్కడ అతడిలాంటి వ్యక్తులు మరో నలుగురు ఉన్నారు. దీంతో ‘ఒక వధువు.. ఐదుగురు పెళ్లి కుమారులు’ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. తీరా ఆరా తీస్తే ఒకే యువతి ఆ ఐదుగురిని మోసం చేసిందని తెలిసీ అందరూ షాక్‌కు గురయ్యారు. హర్దా జిల్లాలో ఓ వ్యక్తికి పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లికి అంతా సిద్ధమైంది. ముహుర్తం నిర్ణయించారు.. ఫంక్షన్ హాల్ బుక్ చేశారు.. పెళ్లి చేసుకుందామని వరుడు, తన కుటుంబం, బంధువర్గంతో కలిసి ఫంక్షన్ హాల్‌కు వెళ్లగా అక్కడ తాళం వేసి ఉంది. దీంతో కంగారుపడిన అతడు వెంటనే వధువుకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎన్నిసార్లు చేసినా స్విచ్ఛాఫే రావడంతో మోస పోయామని గుర్తించి కోలార్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడికి వెళ్లాక వారు ఖంగుతినే సీన్ కనిపించింది. తనలాగ మోసపోయిన నలుగురు పెళ్లి కుమారులు అక్కడ కనిపించారు. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. దీనిపై పోలీసులు వివరాలు సేకరించగా.. ఆ ఐదుగురిని మోసం చేసింది ఒక్కరేనని తేలింది. పెళ్లి చేసుకుందామని ఐదుగురికి ఒకే రోజు ఆ వధువుగా ఉన్న యువతి వారిని నమ్మించింది. దీంతో అది నమ్మిన ఆ ఐదుగురు పెళ్లి మండపానికి రాగా ఆమె అసలు బండారం బయటపడింది. దీని వివరాలు పోలీస్ అధికారి భూపేంద్ర సింగ్ తెలిపారు. ‘మోసం చేసింది ముగ్గురు అని గుర్తించాం. వారు ఓ గ్యాంగ్‌గా మారి పెళ్లి కాని యువకులను ఈ విధంగా వలలో వేసుకుని మోసం చేస్తుంటారు. వారిని ఇప్పటికే అరెస్ట్ చేశాం’ అని భూపేంద్ర సింగ్ వివరించారు. అయితే ఇలాంటి మోసాలు ఆ గ్యాంగ్ తరచూ చేస్తుంటారని చెప్పారు. పెళ్లి కాని యువకులను గుర్తించి వారికి నంబర్లు ఇచ్చి ఓ యువతిని చూపించ్చి మెల్లగా మోసానికి పాల్పడుతుంటారని తెలిపారు. ఆ విధంగా పెళ్లి కొడుకుల నుంచి రూ.20 వేలు వసూలు చేసి ఉడాయిస్తారు అని ఆ పోలీస్ అధికారి తెలిపారు. ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్న వారిపట్ల యువకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
పెళ్లి పీటలపై పబ్జీ
ఓ భర్త తన భార్యను పబ్జీ ఆడొద్దన్నాడని.. విడాకులకు దరఖాస్తు చేసింది భార్య. ఈ ఘటన యూఏఈ లో జరిగింది. తన భార్య నిత్యం ఆన్లైన్లో పబ్జీ ఆడుతుండటంతో.. ఆ ఆటను ఆడొద్దని సూచించాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరు పోలీసులను ఆశ్రయించారు. చాట్ ఆప్షన్ యాక్టివేట్ చేయకుండా.. తన బంధువులు, స్నేహితులతో మాత్రమే ఆడుతున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే తన భార్య ఇలా నిత్యం ఆటలో మునిగిపోవడంతో భార్యగా తన బాధ్యత, విధులను నిర్వహించకుండా ఉంటుందన్న భయంతోనే ఆడొద్దన్నాని ఆ భర్త తెలిపారు. అయినా గేమ్ ఆడొద్దు అని అంటే స్వేచ్ఛను హరించడం కాదంటూ.. ఈ చిన్న విషయానికే తన భార్య విడాకులు అడగటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు. ప్రస్తుతం పబ్జీ ట్రెండ్ నడుస్తోంది. జనాలు నిద్రాహారాలు మాని పబ్జీ గేమ్‌ను ఆడుతున్నారు. ఇదొక వెర్రిగా మారి.. చివరకు వారి ప్రాణాలనూ తీస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ గేమ్‌కు బలయ్యారు. పబ్జీ ఆడొద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు. పచ్చటి కాపురాల్లో కూడా పబ్జీ చిచ్చు పెట్టడం మొదలైనట్లే ఉంది. పెళ్లిలో జీలకర్రాబెల్లం పెట్టేటప్పుడు పెళ్లికూతురూ పెళ్లికొడుకూ ఏం చేస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న? ఒకళ్ల కళ్లలోకి మరొకళ్లు చూసుకుంటూ ఉంటారు.. పెళ్లికూతురు కాస్త సిగ్గుతో ఓరగా చూస్తుంటే, పెళ్లికొడుకు కొంటెగా చూడ్డం, తమనెవరూ గమనించడం లేదనుకున్నప్పుడు చిలిపిగా నవ్వడం వంటివి చేస్తారు. కాకపోతే ఇప్పుడు సీన్ కాస్త మారింది, ఇద్దరూ కలిసి ఫొటోగ్రాఫర్ లేదా వీడియోగ్రాఫర్ కళ్లలోకి చూడవలసి వస్తోంది. మరి తాళి కట్టేటప్పుడు? అప్పుడూ అంతేగా... కావాలంటే ‘పెళ్లిపుస్తకం’ సినిమాలో సీన్ గుర్తు తెచ్చుకోండి... తాళికడుతూ రాజేంద్రప్రసాద్, దివ్యవాణి మెడమీద మెల్లగా గిల్లుతాడు... సారీ.. గిలిగింతలు పెడతాడు కదా!ఇంతకీ ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకనేగా డౌటు.అక్కడికే వెళ్దాం... అక్కడికంటే పెళ్లి సీన్‌కి. రీల్ పెళ్లి కాదు... రియల్ పెళ్లే అది. అక్కడ ఒక పక్క పంతులుగారు మంత్రాలు చదువుతూనే ఉన్నారు. మరోపక్క ఆహూతులందరూ విచ్చేశారు. పెళ్లికూతురు పక్కనే కూర్చుని ఉంది. పెళ్లికొడుకేమో సీరియస్‌గా సెల్ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు!ఎలాగో పెళ్లి కూడా అయిపోయింది... ఆ తర్వాత బంధుమిత్రులందరూ ఒక్కొక్కరుగా వచ్చి అభినందనలు తెలిపి, తెచ్చిన బహుమతో, కానుక ఉన్న కవరో చేతిలో పెట్టి షేక్హ్యాండిస్తుంటే అప్పుడు కూడా పెళ్లికొడుకు పబ్జీని వదల్లేదు. కనీసం మర్యాదకైనా కళ్లెత్తి కూడా చూడలేదెవరినీ. ఈ తతంగాన్ని.. కాదు... నిర్వాకాన్నంతటినీ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది ఇప్పుడు వైరలైంది. ఇదెక్కడి గోలండీ బాబూ... అంటారా? అనండి... అయితే ఆ వెంటనే ఓ ఆలోచన కూడా చెయ్యండి. అదేమిటంటే... మీ పిల్లలు కూడా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనో... స్పోర్ట్స్లోనో, గేమ్స్లోనో స్కోర్ సాధిస్తేనో మురిసి మూర్ఛపోయినంత పని అయ్యి, ఆ మురిపెంలో ఓ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేస్తారు. ఆనక అందులో ఉండే రకరకాల యాప్‌ల ద్వారా జరిగే చిన్నచిన్న లాభాలు చూసి మీ పిల్లల తెలివితేటలకు మరోసారి మురిసిపోతారు. ఆ తర్వాత జరిగేదే మీకు అర్థం కాదు... వాళ్లు ఆ ఫోన్లో అడ్డమైన సైట్లూ చూసి, అడ్డగాడిదలెవరో, అసలైన వాళ్లెవరో తెలియక లౌలోనో, గేమ్స్లోనో మునిగిపోతారు. చదువు కాస్తా చెట్టెక్కించేస్తారు. ఇవన్నీ జరగాలని లేదు... జరగ కూడదని కూడా ఏమీ లేదు. గేమ్స్... అందులోనూ పబ్జీ అనే గేమ్ ఒకేసారి వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కొన్ని వందలమంది ఆడుకోవచ్చు. ఒకసారి ఆ రుచి మరిగారా... ఇక పిల్లలను అందులోనుంచి బయటకు తీసుకురావడం మన వల్ల కాదు.పైనున్న వీడియో గురించి ఎక్కువ సమాచారం లేదు కానీ, అది చూస్తుంటే మాత్రం ఈ సమాచారాన్నంతా చెప్పుకోవలసి వచ్చింది. ఇక మీ ఇష్టం – డి.వి.ఆర్. భాస్కర్ -
దేవుడా కోడల్ని చూపెట్టు..!
కొడుకే పుట్టాలని తమ ఇష్టదైవాలను కోరుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు వారిని ఓ ఇంటివారిని చేయడానికి కనిపించిన దేవుడికల్లా మొక్కాల్సి వస్తోంది. జీవితాంతం కష్టపడి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తర్వాత పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటే ఎక్కడా సంబంధాలు కుదరడం లేదు. యువకుల సంఖ్యకు తగ్గట్లు యువతులు లేకపోవడం, ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు పెళ్లి ప్రస్తావన రాకపోవడం.. అబ్బాయిల విషయంలో అమ్మాయిలు రాజీ పడక పోవడం.. తదితర కారణాలతో జిల్లాలో పెళ్లికాని ప్రసాద్ సంఖ్య పెరిగిపోతోంది. సాక్షి, ఒంగోలు: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. రిటైర్డ్‌మెంట్‌కి మూడు నెలల సమయం ఉంది. ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి వివాహం చేసేందుకు రెండేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నాడు. పిల్లలకు వివాహాలు చేసి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామనుకుంటే కల్యాణ ఘడియలు రావడం లేదు. ఈ పరిస్థితి అతనొక్కడిదే కాదు.. పెళ్లీడొచ్చిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరిదీ. ఒకప్పుడు ఈడొచ్చిన ఆడపిల్లలను తల్లిదండ్రులు గుండెల మీద భారంగా భావించే వారు. పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టాలంటే ఎన్నో సమస్యలు. కాలం మారింది.. ఇప్పుడు కొడుకులకు వివాహాలు చేసేందుకు సతమతమవుతున్నారు. యువకులకు కల్యాణ ఘడియలు సమీపించడం లేదు. అనేక కారణాలతో సంబంధాలు కుదరక లక్షల మంది యువకులు ఎదురు చూస్తున్నారు. పెరిగిన పెళ్లి వయస్సు చదువులు, ఉద్యోగాలు, జీవిత భద్రత అంటూ యువతి, యువకులు సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం లేదు. యువతులకు 23 –25 ఏళ్ల వయస్సు, యువకులు 28– 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రిక్చలర్, ఇంజినీరింగ్, బీఎస్సీ అగ్రిక్చర్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ వంటి కోర్సులు కేవలం కొన్ని వర్గాలకు చెందిన వారు మాత్రమే చదివేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. వీరిలో అమ్మాయిలే అధికంగా కన్పిస్తున్నారు. దీంతో అమ్మాయిల చదువు పూర్తయిన తర్వాతనే మంచి ఉద్యోగం ఉన్న యువకుడితో పెళ్లికి ఒప్పుకుంటున్నారు. అమ్మాయి అభిప్రాయానికే ప్రాధాన్యత ఒకప్పుడు అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే పెళ్లి ముహూర్తం ఖరారు చేసేవారు. ఇప్పుడు అమ్మాయి ఒకే అంటేనే పెళ్లి చూపులు. అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే పెళ్లి.. ప్రస్తుతం అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అబ్బాయి ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు అబ్బాయిలు చదువులకు తగ్గ ఉద్యోగాలు లేకపోవడం, ప్రైవేటు రంగాల్లో, స్వయం ఉపాధివైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో యువకులకు పెళ్లి సంబంధాలు కష్టమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులకు మరీ కష్టమవుతోంది. ఎంత ఆస్తి ఉన్నా పల్లెటూరిలో తమ అమ్మాయి ఉండటం ఇష్టం లేక కొందరు తల్లిదండ్రులు వ్యవసాయం నేపథ్యం ఉన్న వారితో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మంచి ఉద్యోగం, ప్రధాన నగరాల్లో నివసించే సంబంధాలు వస్తే స్థాయికి మంచి కట్నం ఇస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె ఉంటే తల్లిదండ్రులు కూడా ఎక్కడా రాజీ పడటం లేదు. అమ్మాయిల డిమాండ్లు ♦ జీవిత భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, డాక్టర్ కావాలంటున్నారు. ♦ ఒకడే కొడుకు ఉండాలంటున్నారు. ♦ పెద్ద కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి వద్దంటున్నారు. ♦ అత్తమామలు లేకుంటే మరీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ♦ ఫ్యామిలీ పట్టణాల్లోనే ఉండాలనుకుంటున్నారు. వివక్ష పోతేనే పెళ్లిళ్ల కష్టాలు దూరం ఆడపిల్లలను చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారంగా కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో చట్టవిరుద్ధమైన గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయించి, ఆడబిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. యువతీ, యువకుల నిష్పత్తిలో తేడా పెరగడానికి ఇదో ప్రధాన కారణం. ప్రతి వెయ్యి మంది పురుషులకు 986 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటేనే అబ్బాయిలకు సకాలంలో పెళ్లిళ్లు అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిల అభిరుచులు వేరు పెళ్లి విషయంలో అమ్మాయిల అభిరుచులు వేరుగా ఉన్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని అల్లుడిగా చేసుకునేందుకు ముందుకువచ్చారు. తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారంటే ఇష్టపడటం లేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, పోతుందో తెలియకపోవడంతో ఒకింత వెనకడుగు వేస్తున్నారు. అబ్బాయి ఎంత సంపాదిస్తున్నా అమ్మాయిల అభిరుచికి తగినట్లుగా ఉంటేనే పెళ్లికి ఓకే అంటున్నారు. – దీవి సుధాకిరణ్, మ్యారేజ్ బ్యూరో ఆడపిల్లల ఆశకు హద్దు లేదు అమ్మాయిల కోర్కెలకు హద్దులు ఉండటం లేదు. తనకు చదువు తక్కువ అయినా, కాబోయే భర్త ప్రభుత్వ ఉద్యోగైనా అయి ఉండాలి. లేదా రెండు కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైనా కావాలని కోరుకుంటున్నారు. అత్త, మామలు లేకపోతే మరీ మంచిదనే భావన అమ్మాయిల్లో ఉంది. దీని వలన అబ్బాయిలకు వివాహాలు కావటం ఇబ్బందిగా తయారైంది. – కనమర్లపూడి ప్రసాద్, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు, మార్కాపురం ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటున్నారు అమ్మాయిల తల్లిదండ్రులంతా తమ కుమార్తెకు ప్రభుత్వ ఉద్యో గం ఉన్న వరుడు కావాలని కోరుతున్నారు. దీని వల్ల అమ్మాయిలకు డిమాండ్ ఏర్పడింది. ప్రయివేటు ఉద్యోగా లు చేస్తున్న అబ్బాయిలకు పెళ్లిళ్లు బాగా ఆలస్యంగా అవుతున్నాయి. అమ్మాయిలకు ఆలోచన మేరకే వరుడిని చూడమంటున్నారు. – దాసరి తిరుపాలు,మ్యారేజ్ లింక్స్ నిర్వాహకుడు, ఉలవపాడు -
అక్కడ పెళ్లి ఓ మాయ!
మన సమాజంలో పెళ్లి అంటే ఏడడుగులతో.. వేదమంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. జీవితాంతం కలసి మెలసి తోడూనీడగా ఉండాలని కోరుకుంటారు. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకొంటారు. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లి కూడా కమర్షియల్ పుంతలు తొక్కుతోంది. అంటే అన్నీ రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి. అయితే వస్తువుల వరకు సరే కానీ.. పెళ్లి కొడుకు.. బంధువులు.. అందరూ అద్దెకు దొరికితే.. ఏంటీ పెళ్లి కొడుకును కూడా అద్దెకు తీసుకుంటారా అని ఆశ్చర్యపోకండి. ఇదంతా నిజమే కానీ మన దగ్గర కాదులెండి.. వియత్నాంలో! ఇప్పుడు నకిలీ పెళ్లి అక్కడ పెద్ద వ్యాపారంగా వర్ధిల్లుతోంది. ఇలా ఎందుకు చేసుకుంటారంటే అక్కడి యువతులు పెళ్లి కాకముందే గర్భం దాల్చడం సర్వసాధారణం. అందుకే వారు అబార్షన్ చేసుకుంటారు. అలా వియత్నాంలో ఏటా 3 లక్షలకు పైగా అబార్షన్లు జరుగుతాయట. వాటిలో 20 నుంచి 30 శాతం అబార్షన్లు పెళ్లికాని వారే చేయించుకుంటారట. అయితే ఆ బిడ్డను చంపుకోవడం ఇష్టం లేని వారు మాత్రం అబార్షన్ చేయించుకోరు. ఇక్కడే ఉంది ట్విస్ట్. అలా పెళ్లి కాకముందు బిడ్డను కనడం మాత్రం సమాజం ఒప్పుకోదట. దీంతో ఏదో ‘పెళ్లి జరిగింది’ అనిపించేందుకు ఓ పెళ్లి చేసుకుంటారట. నకిలీ పెళ్లి కొడుకులతో పాటు బంధువులు.. ఏర్పాట్లన్నీ సంబంధిత సంస్థలకు డబ్బులు ముట్టజెపితే చేసిపెడతాయి. అంతేకాదు భవిష్యత్తులో ఏవైనా చుట్టాల పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటే ఆ ‘భర్త’లను తిరిగి నియమించుకోవచ్చు. దీనివల్ల యువతులకు పెళ్లి అయిందనే ఒకరకమైన సంతృప్తి కలుగుతుందని వారి నమ్మకం. -
సంచలన నిర్ణయం తీసుకున్నారు!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తూ దాదాపు పదివేల మంది కలిసి తమ ఆలోచనను అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. కనీస అవసరమైన మరుగుదొడ్డి లేని ఇంటికి తమ ఆడబిడ్డల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. టాయిలెట్ సౌకర్యం ఉన్నకుటుంబాల్లో అబ్బాయిలకు మాత్రమే తమ బిడ్డల్నిచ్చి పెళ్లి చేయించాలని తీర్మానించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని 52 గ్రామ పంచాయతీల్లో హర్బా తెగవారు ఒక దృఢమైన తీర్మానం చేసుకున్నారు. 'అగర్ శౌచాలయ్ నహీతో.. బేటీ నహీ ఔర్ రోటీ నహీ' అంటూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామపంచాయతీల్లోని పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దడానికి, టాయిలెట్ల నిర్మాణం, వాడకంలో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. పరిశుభ్ర వాతావరణం, అందరికీ ఆరోగ్యం లక్ష్యసాధన కోసం ఈ ప్రతిజ్ఞ చేశామని హల్బా సమాజ్ ప్రతినిధి వీరేంద్ర మిశ్రా తెలిపారు. మిగిలినవారికి తమ నిర్ణయం స్ఫూర్తిగా నిలవాలని కోరుకున్నారు. మరోవైపు ఈ జిల్లా 100 శాతం బహిరంగ మలమూత్ర విసర్జన ఫ్రీ జిల్లాగా రికార్డు సొంతం చేసుకోనున్నట్టు సమాచారం.