Bihar Woman Stops Husband From Marrying Again And Bride Marries Her To Be Grooms Brother - Sakshi
Sakshi News home page

అన్నతో పెళ్లి ఫిక్స్‌, చివరికి తమ్ముడితో జరిగింది..ఎందుకంటే?

Published Fri, Jun 18 2021 7:43 PM | Last Updated on Sat, Jun 19 2021 9:04 AM

Bihar: Woman Stops Marriage Bride Marries Her To Be Grooms Brother - Sakshi

పట్నా: కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టనుండగా.. ఇంతలో ఓ యువతి పెళ్లి ఆపాలంటూ పోలీసులతో ఎంట్రీ ఇచ్చింది. దీంతో పెళ్లి ఆగిపోవడంతో పాటు వరుడిని కూడా మార్చాల్సి వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పట్నాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పెళ్లి కొడుకు (అనిల్ కుమార్) పాలిగంజ్ సబ్ డివిజన్ లోని సియరాంపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలోని మురార్‌చక్ గ్రామంలో నివసిస్తున్న కుమారి పింకీ అనే యువతితో ఈ నెల 15న పెద్దలు పెళ్లి నిశ్చయించారు.

మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనంగా ఓ యువతి పోలీసులతో మంటపంలోకి రంగప్రవేశం చేసింది. ఆ యువతి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ( కుమార్‌) ఒక సంవత్సరం క్రితం తనని వివాహం చేసుకున్నాడని, వారు భార్యాభర్తలుగా రహస్యంగా కలిసి జీవిస్తున్నారని తెలిపింది. అయితే, అతను తన తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహానికి అంగీకరించాడని చెప్పింది. తన భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు తెలియగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలను ఫోటోలతో సహా చూపించిన్నట్లు పేర్కొంది. దీంతో పెళ్లి ఆగిపోగా.. ఇక చేసేదేమి లేక మరుసటి రోజు ఉదయం వరుడి తమ్ముడితో వివాహం జరిపించారు.

చదవండి: వైరల్‌: వధువు నోరు, ముక్కు నుంచి పొగ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement