
భోపాల్: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ గ్వాలియర్‌లోని కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తరువాత మరుగుదొడ్లు శుభ్రపరిచే సామాన్లలను అందించాలని కోరిన ఆయన స్వయంగా పౌర రక్షణా సిబ్బందితో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడంలేదని కమిషనర్ కార్యాలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘మరుగుదొడ్లు అందరికి ముఖ్యం. టాయ్‌లెట్లు సరిగా లేనందువల్ల మహిళలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఉపయోగపడేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. తోమర్ మార్చి నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చదవండి: పీపీఈ సూట్‌తో ఓటు.. మరో ఎమ్మెల్యేకు కరోనా
Comments
Please login to add a commentAdd a comment