సాక్షి, హైదరాబాద్: అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు ఒక హెచ్చరికలాంటిదని అన్నారు.దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్‌కు మోదీ హెచ్చరించారు. దేశంలో నేడు మూడు రాష్ట్రాల్లో వెల్లడైన ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు.
జీఎస్టీ వసూళ్లు రికార్డ్ సృష్టిస్తున్నాయని మోదీ తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు. ఈ విజయం 2024 విజయానికి బాటలు వేసిందని తెలిపారు. అన్ని రంగాల్లో దేశం ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకుగాను బీజేపీ 164 సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 65 సీట్లకు పరిమితమైంది. రాజస్థాన్‌లో 199 సీట్లకు గాను బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 69 సీట్లను మాత్రమే గెలిచింది. ఇతరులు మరో 15 సీట్లను సొంతం చేసుకున్నారు. అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ అంతే.. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 54 సీట్లను సాధించింది. కాంగ్రెస్ 35కే పరిమితమైంది. ఇతరులు 1 సీటును సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment