భోపాల్: దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల(నవంబర్‌లో) వివిధ దశల్లో పోలింగ్ ముగిసింది. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై ఉంది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి సర్వే ఏజెన్సీల ద్వారా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు.
అయితే.. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సమాజ్‌వాదీ పార్టీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), గోండ్వానా గంతంత్ర పార్టీ (GGP) సంకీర్ణంగా పోటీలో ఉన్నాయి. మధ‍్యప్రదేశ్ ఎన్నికలపై ఎగ‍్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..?
ఎగ్జిట్ పోల్ ద్వారా అంచనా వేయబడిన సంఖ్యలు కేవలం అంచనా కోసం మాత్రమే. ఎందుకంటే వాస్తవ గణాంకాలు అంచనా వేసిన వాటి కంటే చాలా భిన్నంగా కూడా ఉండవచ్చు. ఓటరు ఒక సర్వే ఏజెన్సీ అడిగినప్పుడు ఓటు వేసిన అభ్యర్థి పేరు వెల్లడించకపోవచ్చు. వేరే పేరు చెప్పవచ్చు. వివిధ ఏజెన్సీలకు వేర్వేరు సమాధానాలు ఇవ్వవచ్చు.
పీపుల్స్ పల్స్ సర్వే
- మొత్తం స్థానాలు-230
- కాంగ్రెస్-117 నుంచి 139
- బీజేపీ -91 నుంచి 113
- ఇతరులు- 0 నుంచి 8
న్యూస్ 18 సర‍్వే
- మొత్తం స్థానాలు-230
- బీజేపీ -112
- కాంగ్రెస్- 113
- ఇతరులు- 5
సీఎన్‌ఎన్ సర్వే
- మొత్తం స్థానాలు-230
- బీజేపీ-116
- కాంగ్రెస్-111
- ఇతరులు-3
జన్ కీ బాత్ సర్వే
- మొత్తం స్థానాలు-230
- బీజేపీ- 100-123
- కాంగ్రెస్- 102-125
- ఇతరులు- 05
రిపబ్లిక్ టీవీ-Matrize
- మొత్తం స్థానాలు-230
- బీజేపీ- 118-130
- కాంగ్రెస్- 97-107
- ఇతరులు-0-2
పోల్ స్టార్ట్
- మొత్తం స్థానాలు-230
- బీజేపీ- 106-116
- కాంగ్రెస్- 111-121
- ఇతరులు- 0-6
దేనిక్ భాస్కర్
- మొత్తం స్థానాలు-230
- బీజేపీ-95-115
- కాంగ్రెస్-105-120
News 24-Todays Chanakya
- మొత్తం స్థానాలు-230
- బీజేపీ-151
- కాంగ్రెస్-74
Comments
Please login to add a commentAdd a comment