
కాంతి: అదో ఉమ్మడి కుటుంబం. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు... ఏకంగా కుటుంబంలో 19మందికి కరోనా సోకింది. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మధ్యప్రదేశ్‌లోని కాంతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో చేరి అందరూ విజయవంతంగా కరోనా నుంచి బయటపడ్డారు. మీకు నెగెటివ్ వచ్చింది.. డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్లు చెప్పగానే ఆనందం పట్టలేక 8మంది కుటుంబసభ్యులు ఇలా డ్యాన్స్ చేశారు. చిచోరే సినిమాలోని ‘చింతా కర్‌కే క్యా పాయేగా, మర్‌నే సే పహలే మర్ జాయేగా (బాధపడితే ఏమొస్తుంది, మరణం సంభవించక ముందే చనిపోతావు)’ పాటకు మహిళలు, పిల్లలతో పాటు అంతా ఇలా డ్యాన్స్ చేసి ఆనందం వ్యక్తపరిచారు. ఈ వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. (కీలక దశలో దేశీ వ్యాక్సిన్)
Comments
Please login to add a commentAdd a comment