
మధ్యప్రదేశ్ : సాధారణంగా పాములంటే చాలు కిలోమీటర్ దూరం పరిగెత్తుతాం. కానీ మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనను కాటేయడానికి వచ్చిన పామునే తిన్నాడు. ఈ ఘటన శనివారం మధ్యప్రదేశ్‌లోని మొరానాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబల్‌పూర్ తెహిల్‌సిల్‌లోని పషేర్ గ్రామంలో చోటుచేసుకుంది. జలిమ్ సింగ్ కుష్వాహ(34) అనే వ్యక్తి పొలంలో పనిచేసుకుంటుండగా ఓ నల్లని పాము కనిపించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆయన పామును పట్టుకొని నమిలి తినాలనుకున్నాడు. దీంతో ఆ పాము కాసేపటికి చనిపోయింది. అనంతరం స్పృహ కోల్పొయిన కుష్వాహను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
విషపూరితమైన పామును కొరకడంతో కుష్వాహ స్పృహకోల్పోయాడని డాక్టర్ రాఘవేంద్ర యాదవ్ తెలిపారు. సరైన సమయంలో చికిత్సకు తీసుకొచ్చారని లేకపోతే విషం రక్త ప్రవాహంలోకి చేరి ప్రాణానికే ప్రమాదం ఉండేదని చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment