మధ్యప్రదేశ్: పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో ప్రజలు ఈ ధరలకు భయపడి ఎవరికీ నచ్చిన రీతిలో వారు ప్రయణించడమో లేక ప్రయాణాలను మానుకోవడం వంటి పనులు చేస్తున్నారు. కానీ బయటకీ వెళ్లకపోతే వాళ్లకు జీవోపాధి కష్టమైపోతుంది కూడా. అయితే వీటన్నింటికీ చక్కని పరిష్కారం చూపించాలనుకున్నాడో వ్యక్తి. అంతేకాదండోయ్ బైక్ మీద తొమ్మది మందిని తీసుకువెళ్ల గలిగేలా బైక్‌ని తయారు చేశాడు చూడండి. ఎవరతను ఎక్కడ జరిగిందో అని కుతూహలంగా ఉన్నారా.
(చదవండి: కంగారులో బ్రేకు, యాక్సలరేటర్, పెడల్‌ని కలిపి నొక్కాడు..ఇక అంతే !)
వివరాల్లోకెళ్లితే....ఒక వ్యక్తి మోటర్ బైక్‌ను విమానంలా నడుపుతున్నాడు. ఇదేంటి విమానంలా అని సందేహించకండి. అసలు ఏం చేశాడంటే...దానికి రెక్కల్లగా ఉండేలా చెక్క పలకలు జతచేసి వాటిపై కాళ్ళు చాపి కూర్చున్న వ్యక్తుల సమూహంతో. అతను బైక్‌పై ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా తొమ్మిది మందిని కూర్చోబెట్టుకుని గ్రామీణ ప్రాంతంలోని రహదారిపై డ్రైవ్ చేస్తున్నాడు. అతను తన సహచరుల బరువుతో బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ విమానంలా కదిలాడు.
అయితే దీనికి సంబంధించిన వీడియోతోపాటు "ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌ను ఆకాశానికి ఎత్తినప్పుడు, ప్రజలు కొత్త జుగాద్ విమానాన్ని తయారు చేశారు" అనే క్యాప్షన్‌తో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ "ఇలాంటి జుగాద్ విమానాన్ని తయారు చేయకండి. పైగా వాళ్లంతా హెల్మెట్‌లు ధరించలేదు కాబట్లి ఏదైనా ప్రమాదానికి గురై అవకాశం ఉంది. అంతేకాదు ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించేలా బైక్‌పై ఎక్కవ మందిప్రయాణించకూడదు. " అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
(చదవండి: ఎవరు ఈమె..నా పియానో వాయిస్తుంది ?)
सरकार ने पेट्रोल-डीज़ल को आसमान पर पहुचाया तो जनता ने भी नया जुगाड़ हवाई जहाज बना लिया.. pic.twitter.com/YvnjzdS1uP
— Jaivardhan Singh (@JVSinghINC) October 27, 2021
Comments
Please login to add a commentAdd a comment