మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌..చివరికి ప్రియురాలిని చంపి, పరుపులో కుక్కి.. | Cops Said Mumbai Man Kill Live In Partner Body Hidden In Bed Box | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌..చివరికి ప్రియురాలిని చంపి, పరుపులో కుక్కి..

Published Wed, Feb 15 2023 1:06 PM | Last Updated on Wed, Feb 15 2023 2:27 PM

Cops Said Mumbai Man Kill Live In Partner Body Hidden In Bed Box - Sakshi

ముంబైలో 37 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. గత రెండు రోజులుగా వస్తున్న దుర్గంధాన్ని భరించలేక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటన ముంబైలోని సీతాసదన్‌ సోసైటీలో చోటు  చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...27 ఏళ్ల హర్దిక్‌ షా, మేఘా ధన్‌సింగ్ తోర్వి అనే మహిళతో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గత ఆరు నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే సీతాసదన్‌ సోసైటీలో కొత్త ఇంటికి మారారు. ఐతే మేఘ నర్సుగా పనిచేస్తోంది. కాగా, హార్దిక్‌ నిరుద్యోగి. ఇంటి ఖర్చులను భరించేది మేఘానే.

దీంతో ఈ విషయమై తరుచు గొడవపడేవారు. ఒక రోజు ఆ గొడవ కాస్త తీవ్రస్థాయికి చేరుకోవడంతో క్షణికావేశంలో హర్ధిక్‌ మేఘాను చంపి పరుపులో కుక్కి ఉంచాడు. ఆ తర్వాత హర్దిక​ ఖర్చులకు డబ్బుల కోసం ఇంట్లోని వస్తువును అమ్మేసి పరారయ్యేందుకు ప్లాన్‌​ వేశాడు. అయితే గత రెండు రోజులుగా విపరీతమైన దుర్గంధం రావడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా మేఘా విగత జీవిగా ఉండటాన్ని గమనించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ జంట ఇటీవలే అద్దెకు వచ్చాని, తరుచు గొడపడుతుంటారని అపార్టెమెంట్‌ వాసులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేయడం ప్రారంభించి..హార్దిక్‌ ఫోన్‌ని ట్రేస్‌ చేయడం ప్రారంభించారు పోలీసులు. అతను ఇంట్లోని వస్తువులను అమ్మేసి రైలులో పారిపోతున్నట్లు తెలియడంతో అధికారులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు హార్ధిక్‌ని మధ్యప్రదేశ్‌ నాగ్డాలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 

(చదవండి: షాకింగ్‌ ఘటన: దాబాలోని ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement