Live-in partner
-
‘సహజీవనంలో భాగస్వామిని అలా విచారించలేం’
సహజీవనంలో భాగస్వామిపై 498 కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో మహిళతో సహజీవనం చేసే వ్యక్తిని భర్తగా పరిగణించలేమని పేర్కొంది. మహిళ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తిని భర్తగా భావించి సెక్షన్ 498 ప్రకారం క్రూరత్వం కింద విచారించలేమని స్పష్టం చేసింది.చట్టబద్ధంగా వివాహం చేసుకోని మహిళ తనతో రిలేషన్లో ఉంటున్న వ్యక్తి క్రూరత్వానికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు పెట్టలేమని హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన మహిళతో రిలేషన్లో ఉన్న వ్యక్తిపై విచారణను రద్దు చేస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది.కాగా 2023 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు తాము లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న సమయంలో తన భాగస్వామి మానసికంగా, శారీరంగా వేధించాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు భర్త అనే పదానికి నిర్వచనాన్ని చెబుతూనే, లివ్ ఇన్ పార్ట్నర్ని భర్తగా చూడలేమని చెప్పింది.సెక్షన్ 498A కింద నేరాన్ని నమోదు చేయాలంటే. భర్త లేదా భర్త బంధువులు క్రూరత్వానికి పాల్పడి ఉండాలని కోర్టు సూచించింది. మహిళతో చట్టబద్దంగా వివాహం జరిగిన వ్యక్తిని భర్తగా పరిగణిస్తారని తెలిపింది. చట్టబద్ధమైన వివాహం లేకుండా స్త్రీ భాగస్వామిని సెక్షన్ 498 ఏ క్రూరత్వం కింద విచారించలేమని చెప్పింది. -
మూడేళ్లుగా రిలేషన్షిప్..చివరికి ప్రియురాలిని చంపి, పరుపులో కుక్కి..
ముంబైలో 37 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. గత రెండు రోజులుగా వస్తున్న దుర్గంధాన్ని భరించలేక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ముంబైలోని సీతాసదన్ సోసైటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...27 ఏళ్ల హర్దిక్ షా, మేఘా ధన్సింగ్ తోర్వి అనే మహిళతో మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. గత ఆరు నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే సీతాసదన్ సోసైటీలో కొత్త ఇంటికి మారారు. ఐతే మేఘ నర్సుగా పనిచేస్తోంది. కాగా, హార్దిక్ నిరుద్యోగి. ఇంటి ఖర్చులను భరించేది మేఘానే. దీంతో ఈ విషయమై తరుచు గొడవపడేవారు. ఒక రోజు ఆ గొడవ కాస్త తీవ్రస్థాయికి చేరుకోవడంతో క్షణికావేశంలో హర్ధిక్ మేఘాను చంపి పరుపులో కుక్కి ఉంచాడు. ఆ తర్వాత హర్దిక ఖర్చులకు డబ్బుల కోసం ఇంట్లోని వస్తువును అమ్మేసి పరారయ్యేందుకు ప్లాన్ వేశాడు. అయితే గత రెండు రోజులుగా విపరీతమైన దుర్గంధం రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా మేఘా విగత జీవిగా ఉండటాన్ని గమనించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ జంట ఇటీవలే అద్దెకు వచ్చాని, తరుచు గొడపడుతుంటారని అపార్టెమెంట్ వాసులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేయడం ప్రారంభించి..హార్దిక్ ఫోన్‌ని ట్రేస్ చేయడం ప్రారంభించారు పోలీసులు. అతను ఇంట్లోని వస్తువులను అమ్మేసి రైలులో పారిపోతున్నట్లు తెలియడంతో అధికారులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు హార్ధిక్‌ని మధ్యప్రదేశ్ నాగ్డాలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: షాకింగ్ ఘటన: దాబాలోని ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం) -
కలిసుందామని రమ్మంటే.. రూ 30 లక్షలు కాజేశాడు
అహ్మదాబాద్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి 30 లక్షల రూపాయలు కాజేశాడని గుజరాత్‌కు చెందిన ఓ మహిళా టీచర్ (42) పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆశీష్ మోదీ ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడని బాధితురాలు నవరంగ్పురకు చెందిన ఆర్తి సాంధారియా ఆరోపించింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆర్తీ ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆరేళ్లక్రితం కార్ డీలర్షిప్ వద్ద ఆమెకు సరేంద్రనగర్కు చెందిన ఆశీష్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ తరచూ కలిసేవారు. 12 ఏళ్ల క్రితం భార్య నుంచి విడిపోయినట్టు ఆశీష్ చెప్పగా, తాను కూడా భర్తకు దూరమైనట్టు ఆర్తీ చెప్పింది. సహజీవనం చేసేందుకు ఆర్తీ ఆహ్వానించగా, ఆశీష్ అంగీకరించాడు. వీరి బంధం కొన్నేళ్లు సవ్యంగా సాగింది. కాగా గత ఏప్రిల్‌లో ఆశీష్ తనకు తెలియకుండా డబ్బులు డ్రా చేసినట్టు ఆర్తీ గుర్తించింది. ఏటీఎమ్ కార్డుల నుంచి డబ్బు కాజేయడంతో పాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిక్ బ్యాంక్ ఎకౌంట్ల నుంచి 10 లక్షలు డ్రా చేసినట్టు తెలుసుకుంది. ఇక క్రెడిట్ కార్డు ఉపయోగించి మరో 8 లక్షలు వాడుకున్నట్టు గుర్తించింది. ఈ విషయంపై ఆశీష్‌ను నిలదీయగా, డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆర్తీకి దూరంకావడంతో పాటు ఫోన్ చేసినా మాట్లాడేవాడు కాదు. నాలుగేళ్ల క్రితం వ్యాపారనిమిత్తం 9 లక్షల రూపాయలు, ఏడాది క్రితం మరో నాలుగు లక్షల రూపాయలు ఆశీష్కు అప్పుగా ఇచ్చినట్టు ఆర్తీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.