
తిరుపతి, సాక్షి: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో తనపై జరిగిన విష ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ ప్రచారం చేసిన పత్రికలు, మీడియా సంస్థలకు పరువు నష్టం నోటీసులు పంపించారు.
ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్ కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు పంపించినట్లు సమాచారం, ఇందులో ఈనాడు, ఈటీవీ 50 కోట్ల రూపాయలు, మహా న్యూస్ కు 50 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై నిరాధరంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి న్యాయ పరంగా బుద్ధి చెప్తానని ఇదివరకే ఆయన ప్రకటించారు. ఇప్పుడు నోటీసులు పంపగా.. అతి త్వరలో ఆయన కేసు వేస్తారని ఆయన తరఫు న్యాయవాదులు అంటున్నారు.
