కాంగ్రెస్ చేతిలో తోలుబొమ్మలా మారకు: రాందేవ్
కాంగ్రెస్ చేతిలో తోలుబొమ్మలా మారకు: రాందేవ్
Published Thu, Apr 3 2014 2:17 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
చండీఘడ్: బీజేపీలో కలిసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దారులు వెతుకుతోందని యోగా గురువు రాందేవ్ బాబా విమర్శించారు. ఆప్ ప్రజల మద్దతు కోల్పోయిందని రాందేవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు తిరస్కరించడంలో ఆప్ నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేపట్టారన్నారు. చండీఘడ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్టాడుతూ.. దేశానికి మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని రాందేవ్ అన్నారు.
మోడీతో చేతులు కలపడానికి కేజ్రీవాల్ సిద్దపడితే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ఆయన అన్నారు. అవినీతి పోరాట ఉద్యమంలో తాను కేజ్రీవాల్ కు మద్దతు తెలిపానని ఆయన అన్నారు. వ్యవస్థను మార్చేందుకు ఉద్యమించిన కేజ్రీవాల్ దారి తప్పారని రాందేవ్ విమర్శించారు. అంతేకాకుండా కాంగ్రెస్ చేతిలో తోలుబొమ్మలా మారకు అని కేజ్రీవాల్ కు రాందేవ్ సూచించారు.
Advertisement