'వారణాసిలో మోడీపై పోటీ చేయాలని ఉంది'
భోపాల్: ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోకసభ స్థానంలో పోటీ చేయాలని ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన మనసులో మాటను మీడియా సమావేశంలో బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటి చేస్తానని డిగ్గిరాజా తెలిపారు.
తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వారణాసి నుంచి పోటి చేయాలని ఉంది. పార్టీ టికెట్ కేటాయిస్తే అందుకు సిద్దం అని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి బరిలో నిలవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ కూడా పోటికి ఆసక్తి చూపుతుండటంతో వారణాసి పోటి మరింత ఉత్కంఠ రేపుతోంది.