చండీగఢ్: బాబా రాందేవ్‌కు హరియాణా ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించిం ది. యోగా, ఆయుర్వేదాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర బ్రాండ్ అంబాసడర్‌గా నియమితుడైన బాబా రాందేవ్‌కు కేబినెట్ మంత్రికి సమాన హోదా కల్పించాలని సోమవారం హర్యానా మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్ మంత్రికి సమాన హోదా ఇచ్చినప్పటికీ.. కేబినెట్ మంత్రి పొందే వేతన సౌకర్యాలు రాందేవ్ పొందలేరని, ప్రొటోకాల్ సౌకర్యాలు మాత్రం పొందుతారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో యోగా, ఆయుర్వేదాలకు ప్రాచుర్యం కల్పించేందుకు పతంజలి యోగపీఠ్‌తో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామని హరియాణా మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు.