పాట్నా : ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి సందర్భంగా పెరోల్‌పై పాట్నాలోని తన ఇంటికి వచ్చారు. పెరోల్‌పై ఇంటికి వచ్చిన ఆయనకి ఆరోగ్యం బాగాలేని కారణంగా వైద్య చికిత్సల కోసం ఆరు వారాల బెయిల్ కూడా కోర్టు మంజూరుచేసింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. యోగా గురు రాందేవ్ బాబా కూడా లాలూను పరామర్శించారు. ‘ ఆరు వారాల బెయిల్ మంజూరైనందుకు అభినందనలు లాలూ జీ. యోగా చేస్తూ మీకు మీరుగా ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించండి’ అని రాందేవ్ సూచించారు.
పశువుల దాణా కుంభకోణ కేసుల్లో రాంచిలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ, గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయనకు ప్రత్యేక చికిత్స కూడా అందించారు. ఇటీవలే ఆయన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంటికి వచ్చిన ఈయనకు ఆరోగ్య విషయాలపై ప్రముఖులు పలు సూచనలు చేస్తున్నారు. కాగ, 2016లో కూడా రాందేవ్, ఢిల్లీలో జరిగిన యోగా సెషన్‌కు లాలూను ఆహ్వానించారు. రాందేవ్ బీజేపీకి సన్నిహితుడు కావడంతో, లాలూ ఆయనతో అంటిముట్టన్నట్టు ఉంటారు. దాణా కేసుల్లో తనని జైలులో పెట్టడం బీజేపీ కుట్రనేనని లాలూ ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో ఓ సారి రాందేవ్‌పై లాలూ చమత్కరాలు కూడా చేశారు. 2011లో ఓ ఆందోళన చేపట్టిన రాందేవ్ బాబా, పోలీసులు రావడంతో, స్టేజీపై నుంచే పారిపోయారు. దీన్ని కోట్ చేస్తూ.. రామ్‌లీలా మైదాన్‌లో రాందేవ్ యోగసనాలు చేయమంటారు కానీ పోలీసులు వస్తే మాత్రం ఆయన జంప్ అయి పోతారు అని లాలూ జోకులు పేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment