
పీఓకేను స్వాధీనం చేసుకోవాలి: రాందేవ్
మోతిహారి: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను భారత్ వెంటనే తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. పాక్ నుంచి తలెత్తుతున్న అన్ని సమస్యలకు అదే మూలకారణమని అభిప్రాయపడ్డారు. అలాగే పీఓకేలోని అన్ని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయాలని కోరారు. చంపారన్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ నిర్వహించిన మూడు రోజుల యోగా కార్య క్రమంలో చివరి రోజైన శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
భారత్ పాక్ సరిహద్దు ల్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులు అజహర్ మసూద్, హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం లను సజీవంగా లేదా వారి మృతదేహాలనైనా భారత్‌కు అప్పగించాలని రాందేవ్ పాక్‌ను డిమాండ్ చేశారు. మద్యపానాన్ని నిషేధిం చాలని నిర్ణయించిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. యోగాను రాజకీయ ఎజెండాగా చూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.