కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలను ప్రస్తావిస్తూ.. పీవోకే భారత్‌లో భాగమే. మేం దానిని తీసుకుంటామని అన్నారు.
2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్‌లో శాంతి నెలకొందని పశ్చిమ బెంగాల్ సేరంపోరే నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ప్రసంగించారు.
ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తుంది. 2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించింది. అయితే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఆజాదీ నినాదాలు వినిపించగా, ఇప్పుడు పీఓకేలో కూడా అదే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఇక్కడ రాళ్లు రువ్వేవారని, ఇప్పుడు పీఓకేలో రాళ్లు రువ్వుతున్నారు అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా చొరబాటుదారులు కావాలా లేదా శరణార్థులకు సీఏఏ కావాలా అనేది పశ్చిమ బెంగాల్ నిర్ణయించుకోవాలి. జిహాద్‌కు ఓటు వేయాలా లేదా వికాస్‌కు ఓటు వేయాలా అనేది బెంగాల్ నిర్ణయించుకోవాలి అని అమిత్ షా పిలునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment