జమ్ము:పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లేకుండా జమ్ముకశ్మీర్(Jammukashmir) అసంపూర్ణమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnathsingh) అన్నారు.అఖ్నూర్ సెక్టార్‌కు సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్ వద్ద 9వ సాయుధ దళాల వెటరన్స్ డే నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.
పాకిస్తాన్‌కు పీఓకే విదేశీ భూభాగం అవుతుంది తప్ప మరొకటి కాదన్నారు.అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారు చేస్తోందని మండిపడ్డారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హఖ్ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు.కశ్మీర్ పట్ల గత ప్రభుత్వాలు భిన్న వైఖరిని అనుసరించాయన్నారు.దీంతో ఇక్కడి సోదరసోదరీమణులు ఢిల్లీకి చేరువ కాలేకపోయారన్నారు.
దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానించడం మా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ప్రజలకు, ఢిల్లీకి మధ్య దూరాన్ని చెరిపివేసేలా ఆయన పని చేస్తున్నారని ప్రశంసించారు.
గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో భాగమేనని, తాము దానిని దానిని తీసుకుంటామన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్‌లో శాంతి నెలకొందన్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తోందన్నారు.
కాగా,పీఓకే ప్రజల స్వయం నిర్ణయాధికారం గురించి మాట్లాడిన పార్టీలన్నింటినీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించడాన్ని భారత విదేశాంగ శాఖ గతంలో తప్పు పట్టింది. పాకిస్తాన్‌లో పీఓకే విలీనాన్ని ఆమోదించని వారిని, వ్యతిరేక ప్రచారం నిర్వహించేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించవచ్చునన్న నిబంధన పీఓకే తాత్కాలిక రాజ్యాంగంలో ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment