ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీకి ఇబ్బందే | If Priyanka Gandhi takes charge of Congress then BJP will face tough challenge: Ramdev | Sakshi
Sakshi News home page

ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీకి ఇబ్బందే

Published Sun, May 22 2016 7:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

If Priyanka Gandhi takes charge of Congress then BJP will face tough challenge: Ramdev

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ చేపడితే బీజేపీకి ఇబ్బందేనని యోగా గురువు రాందేవ్ బాబా సంచలన  వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీ  బాధ్యతను  ప్రియాంకకు అప్పగించాలని పలువురు పార్టీ కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రియాంక క్రియా శీలకంగా వ్యవహరిస్తే బీజేపీ మరింత కష్ట పడాల్సి వస్తుందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సోనియా గాంధీ తన పట్ల వ్యవహిరించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన స్పష్టం చేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement