న్యూఢిల్లీ: అల్లోపతి వైద్య విధానం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి భారీ విమర్శలు మూటగట్టుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన యోగా గురు రాందేవ్ బాబా సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) 25 ప్రశ్నలు సంధించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివాటికి శాశ్వత పరిష్కారం అల్లోపతి వద్ద ఉందా అంటూ ప్రారంభించారు. అల్లోపతికి కేవలం 200 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందన్నారు. థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఆస్తమా వంటి రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా అని ప్రశ్నించారు.
కొలెస్టరాల్‌కు, మైగ్రేన్‌కు, అమ్నీసియాకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని చికిత్స ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెలో ఏర్పడే రంధ్రాలకు నొప్పి లేకుండా చికిత్స చేయగలరా అని అడిగారు. వయస్సును వెనక్కు మళ్లేలా చేసి హీమోగ్లోబిన్‌ను పెంచే చికిత్స ఉందా అన్నారు. అల్లోపతి అన్నింటికి సమాధానం ఇస్తే డాక్టర్లకు ఏ రోగమూ రాకూడదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment