కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె ప్రారంభమైంది. యువ డాక్టర్ హత్యకు నిరసనగా ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది.
ఇందులో భాగంగా శనివారం(ఆగస్టు17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో అవుట్‌పేషెంట్(ఓపీ) సేవలు ఆగిపోయాయి. మళ్లీ ఆదివారం ఉదయం 6 గంటల తర్వాతే డాక్టర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
విశాఖపట్నంలో నిలిచిపోయిన వైద్య సేవలు
- జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
- అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్
- నిరసనలో పాల్గొననున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు
- విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం.. మద్దతు పలకనున్న అన్ని ప్రజా సంఘాలు..
అనంతపురంలో వైద్యుల సమ్మె..
కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలి అత్యాచారం, హత్య నిరసిస్తూ వైద్య సేవలు నిలిపివేసిన అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు. జీజీహెచ్‌లో అవుట్‌పేషెంట్ సేవల నిలిపివేత.
విజయవాడలో ఆగిన ఓపీ సేవలు
- కోల్ కతాలో జూనియర్ డాక్టర్ దారుణహత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళన
- విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు
- నేడు ఓపీ సేవలు పూర్తిగా నిలుపుదల
- అత్యవసర సేవలకు మినహాయింపు
- జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
- కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్
తిరుపతిలో డాక్టర్ల నిరసన
- రుయా హాస్పిటల్ వద్ద ఏపి జూడాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్అసోషియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన
- బహిరంగ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్న జూడాలు
- తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజి మెడికల్ విద్యార్థులు, జూడాలు ఆద్వర్యంలో నిరసన
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు జూనియర్ వైద్యులు, ఇతర సీనియర్ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలితోపాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టంచేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోతున్నామని చెప్పారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు.
ఇదిలా ఉండగా, ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా, కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని పేర్కొంది. కోల్‌కతాలోని డాక్టర్ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment