బాబా 'జీన్స్' కమింగ్ సూన్.. | Ramdev to launch 'desi' jeans under apparel brand 'Paridhaan' | Sakshi
Sakshi News home page

బాబా 'జీన్స్' కమింగ్ సూన్..

Published Sat, Sep 10 2016 12:02 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

బాబా 'జీన్స్' కమింగ్ సూన్..

బాబా 'జీన్స్' కమింగ్ సూన్..

హరిద్వార్ : పతంజలి బ్రాండ్స్తో మార్కెట్లో దూసుకెళ్తున్న రాందేవ్ బాబా, బట్టల సామ్రాజ్యాన్ని కూడా స్థాపించనున్నారట. మల్టీ కోర్ "స్వదేశీ" కన్సూమర్ గూడ్స్లో బట్టల ఉత్పత్తులను ప్రారంభించనున్నారు. పరిధాన్ పేరుతో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి, జీన్స్, ఆఫీసులకు అనుగుణమైన బట్టలను అందించనున్నారు. అదేవిధంగా గ్లోబల్గా కూడా తన సత్తా చాటాలని రాందేవ్ ప్లాన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్, ఆఫ్రికాలో మొదట ప్లాంట్లను స్థాపించి, అనంతరం యూరప్, యూఎస్లో తన బిజినెస్లను విస్తరించనున్నట్టు రాందేవ్ చెబుతున్నారు.
 
పురుషులకు, మహిళలకు ఇద్దరకూ అనువైన బట్టలను తయారుచేయనున్నామని రాందేవ్ తెలిపారు. కేవలం భారతీయ సంప్రదాయ దుస్తులనే కాక, జీన్స్ లాంటి మోడ్రన్ దుస్తులు కూడా తయారుచేయనున్నట్టు ప్రకటించారు. దేశీ జీన్స్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించబోతున్నామని తెలిపారు. లుథియానాలోని మంచి తయారీదారులు ఉన్నారని, ఇతర చేనేత సెంటర్లు ఈ దుస్తులను డిజైన్ చేయనున్నట్టు చెప్పారు. హరిద్వార్ శివార్లో విశాలమైన ప్రాంగణంలో రాందేవ్ తన స్నేహితుడు ఆచార్య బాలకృష్ణన్తో కలిసి ఓ సంస్థను నిర్వర్తిస్తున్నారు. ఇదేమాదిరి బంగ్లాదేశ్లో పతంజలి ఉత్పత్తుల తయారీకి మిశ్రమ ప్యాక్టరీని ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. 
 
ఇప్పటికే నేపాల్ మార్కెట్లో తాము ప్రవేశించామని, బంగ్లాదేశ్ అనంతరం ఆఫ్రికా మార్కెట్ లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. దేశీయ మార్కెట్ పరిస్థితులతో సరితూగే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదట తమ వ్యాపారాల వృద్ధి చేపడతామని రాందేవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. స్టేజ్2 అనంతరం యూరప్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో బహుళ జాతీయ కంపెనీలతో పోటీకి సిద్ధమవుతామని ప్రకటించారు. హెర్బల్ టూత్ పేస్టులు మొదలుకుని, నూడుల్స్, హెల్త్ డ్రింక్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తుల వరకు మొత్తం 800 పైగా ప్రొడక్ట్స్ పతంజలి బ్రాండ్పై మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో పాగా వేసుకున్న కంపెనీలకు పతంజలి ఉత్పత్తులు వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement