'బ్రోకర్ లా వ్యవహరిస్తున్న బాబా' | 'Ramdev acting as broker a deal between Congress rebel MLAs and BJP' | Sakshi
Sakshi News home page

'బ్రోకర్ లా వ్యవహరిస్తున్న బాబా'

Published Thu, Mar 24 2016 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

'బ్రోకర్ లా వ్యవహరిస్తున్న బాబా'

'బ్రోకర్ లా వ్యవహరిస్తున్న బాబా'

హరిద్వార్: ఉత్తరాఖండ్ లో రాజకీయ అనిశ్చితికి యోగా గురువు రాందేవ్ కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆయన బీజేపీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు, కాషాయ పార్టీకి మధ్య బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాందేవ్, అమిత్ షా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ ఆరోపించారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలతో రాందేవ్ టచ్ లో ఉన్నారనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. అసంతృప్త ఎమ్మెల్యేలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని అన్నారు. రాందేవ్ తీరుతో స్వాములకే కాదు ఉత్తరాఖండ్ కు చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఏజెంట్ మాదిరిగానే కాకుండా పార్టీ కార్యకర్తలా కూడా వ్యహరిస్తున్నారని కిశోర్ ఉపాధ్యాయ మండిపడ్డారు.

ఉత్తరాఖండ్ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోలేదని రాందేవ్ తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తతో తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. అమిత్ షా, నరేంద్ర మోదీని స్వతంత్రంగా పనిచేసుకోవాలని సూచించారు. గురువారం హరిద్వార్ లో పూలతో రాందేవ్ హోలీ వేడుకలు జరుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement