బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు
– జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సోమవారం తలపెట్టిన బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. పార్టీ శాసన సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు.. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై బంద్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. నల్లధనాన్ని వెలికి తీయడానికి కేంద్రం చేపట్టే ఎలాంటి చర్యలనైనా వైఎస్‌ఆర్‌సీసీ సమర్థిస్తుందన్నారు. అయితే ముందు చూపు లేకుండా..సరైన చిల్లర నగదును విడుదల చేయకుండా ఆ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు 18 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో తలపెట్టిన బంద్‌కు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. బంద్‌పై ప్రజలను చైతన్యపరిచేందుకు బైక్‌ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ వర్గాలకు సూచించారు.