బంద్‌ సంపూర్ణం | YSRCP Bandh Grand Successful Prakasam | Sakshi
Sakshi News home page

బంద్‌ సంపూర్ణం

Published Wed, Jul 25 2018 11:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

YSRCP Bandh Grand Successful Prakasam - Sakshi

ప్రత్యేహోదా ప్లకార్డును ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

యర్రగొండపాలెం(ప్రకాశం): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం బంద్‌ సంపూర్ణంగా విజయవంతం అయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా దుకాణాలు, బ్యాంకులు, హోటళ్లు పలు విద్యా సంస్థలు తెరవలేదు. ఈ పరిస్థితి సాయంత్రం వరకు కొనసాగింది. సీఐ, ఎస్సైలతోపాటు ప్రత్యేక  పోలీసులు రోడ్ల వెంట పహారా కాసినప్పటికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ వారి కళ్లు కప్పి మోటారు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆయన వాహనాన్ని పోలీసులు మార్కాపురం నుంచి వెంటాడినప్పటికీ ఎమ్మెల్యే ప్రధాన రోడ్డుగుండా కాకుండా పల్లె ప్రాంతాలనుంచి యర్రగొండపాలెం చేరారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సి ఉంది. అయితే అక్కడ పోలీసులు భారి ఎత్తన మోహరించి ఉన్నారని తెలుసుకున్న ఆయన స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్దకు చేరారు. అక్కడి నుంచి ఆయన మోటారు బైక్‌పై ర్యాలీగా బయల్దేరి సెంటర్‌కు చేరుకున్నారు.

టీషర్ట్‌ వేసుకొని ఉండటం వలన ముందుగా పోలీసులు ఆయనను గుర్తించలేదు. కార్యకర్తలు గుంపుగుంపులుగా చేరి వైఎస్సార్‌ విగ్రహం వదకు చేరుకునే సరికి పోలీసులు వారిని మోహరించి అరెస్ట్‌ చేశారు. ప్రత్యేక హోదా నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే సురేష్‌ను ఎస్సై లాక్కొని వెళ్లారు. అనంతరం పోలీసులు 15 మందిని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయినవారిని బైండవర్‌ చేసుకొని వదలివేశారు.  పార్టీ మండల అధ్యక్షుడు దొంతా కిరణ్‌గౌడ్‌ ఇంట్లోకి వెళ్లిన సురేష్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేసి ఎక్కడికి వెళ్లకుండా కాపలా కాశారు. అరెస్ట్‌ అయిన వారిలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్‌ సీపీ మండల, పట్టణ అధ్యక్షులు డి.కిరణ్‌గౌడ్, షేక్‌.జబీవుల్లా, పార్టీ సీనియర్‌ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, బీసీ, యువజన విభాగాల రాష్ట్ర కార్యదర్శులు ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎన్‌.వెంకటరెడ్డి, కో ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు ఎ.శ్రీరాములు, ఎంపీటీసీ సభ్యుడు పాత్లావత్‌ రాములు నాయక్, సర్పంచ్‌ అప్పారావు, మాజీ సర్పంచ్‌ గాలి శ్రీనివాసరెడ్డి, బిజ్జం రమణారెడ్డి, బి.బాలచెన్నయ్య, ఎం.ఎస్రాలు  ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు వై.వెంకటేశ్వరరెడ్డి, వి.మోహన్‌రెడ్డి, మేడగం వెంకటరెడ్డి, ముసలారెడ్డి, గజనీ వెంకటేశ్వరరెడ్డి, మురళీధర్‌రెడ్డి, ఒ.సుబ్బారెడ్డి, డి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

బంద్‌ విజయవంతం
త్రిపురాంతకం: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసేసి బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు అనంతపురం –అమరావతి హైవేపై ర్యాలీ నిర్వహిస్తూ ప్రత్యేక హోదాకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్న నిరసనకారులను ఎస్‌ఐ కమలాకర్‌ అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  బంద్‌ చేపట్టేందుకు సిద్ధమైన నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంద్‌లో పార్టీ మండల అధ్యక్షుడు పి.చంద్రమౌళిరెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ కోట్ల సుబ్బారెడ్డి, దగ్గుల గోపాల్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మిబాయి, పిచ్చయ్య, కోట సుబ్బారెడ్డి, గుడిమెట్ల రంగయ్య, రంగబాబు, కోట్ల గురవారెడ్డి, రాజయ్య, ఖాన్, పోలిరెడ్డి, వెంగళ్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, లింగయ్య పాల్గొన్నారు.


అడ్డుకున్న పోలీసులు
పెద్దారవీడు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి వ్యతిరేకంగా  పార్టీ మండల కన్వీనర్‌ పాలిరెడ్డి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పెద్దారవీడులో మార్కాపురం– పెద్దదోర్నాల రోడ్డుపై నిరసన చేపట్టారు. నిరసన తెలుపుతున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని ఎస్‌ఐ పి.ముక్కంటి బలవంతంగా అరెస్టు చేశారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర దివంగతనేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రాహానికి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బంద్‌లో పాల్గొనేందుకు మండలంలోని 19 పంచాయతీల నుంచి నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, విద్యార్థులు, రైతులు, యువకులు భారీగా తరలివచ్చారు.

అరెస్టు చేసిన వారిలో పార్టీ కన్వీనర్‌ పాలిరెడ్డి, క్రిష్ణారెడ్డి, జిల్లా సేవాదళ్‌ కార్యదర్శి కాసు వెంకటరెడ్డి, మండల యూత్‌ కన్వీనర్‌ తమ్మిశెట్టి తిమ్మరాజు, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఓద్దుల లక్ష్మిరెడ్డి, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మూల వెంకటరెడ్డి, నాయకులు అల్లు వెంకటేశ్వరరెడ్డిలను ఎస్‌ఐ అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని పంపించారు. నియోజవర్గ సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను యర్రగొండపాలెంలో జరగబోయే బంద్‌లో పాల్గొంటారని ముందుగానే అరెస్ట్‌ చేయాలని హనుమాన్‌జంక్షన్‌కుంటలో పోలీసులు కాపుకాశారు. ముందుగానే ఆయనకు నాయకులు ఎప్పటికప్పడు సమాచారం అందించడంతో చాకచక్యంగా యర్రగొండపాలెం చేరుకొని బంద్‌లో పాల్గొన్నారు.

తంగిరాలపల్లె పంచాయతీలో పాఠశాలలు బంద్‌ 
వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు మండలంలోని తమ్మడపల్లె, తంగిరాలపల్లె, ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్‌ పాఠశాలలను మూయించారు. ప్రత్యేకహోదా కోసం  విద్యార్థులు కూడా మద్దతు పలికి సంతోషం వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్‌ వీరాంజనేయులు, నాయకులు గిరిప్రసాద్, యూత్‌ నాయకులు పి శ్రీను, జి గాలెయ్య, కె రామయ్య, కె యల్లరాజు, తదితరులు పాల్గొన్నారు.


పెద్దదోర్నాలలో..
పెద్దదోర్నాల: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించటంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కేంద్రంలో నిర్వహించిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. బంద్‌ సందర్భంగా మండల కేంద్రంలో వాణిజ్య సముదాయాలతో పాటు, విద్యా సంస్థలు, బ్యాంకులు, హోటళ్లు, పలు వ్యాపార సంస్థలు, స్వచ్ఛందంగా దుకాణాలను మూసి బంద్‌కు మద్దతు పలికారు.  బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు జంకె ఆవులరెడ్డి, మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ మజీద్, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు లాలూనాయక్, మాజీ ఎంపీపీ జోగి వెంకటనారాయణ, నాయకులు చిట్యాల యోగిరెడ్డి, యక్కంటి మల్లారెడ్డి, లింగారెడ్డి, చిట్యాల లక్ష్మీరెడ్డి, వెన్నా కాశిరెడ్డి, వల్లభనేని పవన్‌కుమార్, మాండ్ల వెంకటేశ్వర్లు, సాదం పిచ్చయ్య,  కొండెపోగు ఆశీర్వాదం, దుగ్గెంపూడి వెంకటనారాయణరెడ్డి, ఒంటేరు నాగేశ్వరరావు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో నిర్బంధించారు.

 
బంద్‌ సంపూర్ణం

పుల్లలచెరువు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ చేపట్టారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్‌ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో అలుపెరగని పోరాటం చేస్తోంది ఒక్క వైఎస్సార్‌ సీపీనే అన్నారు.

15 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు మాజీ ఎంపీపీ ఎం.సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌ బి.వి.సుబ్బారెడ్డి, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఎల్‌.రాములు, ఎంపీటీసీ సభ్యుడు మాణిక్యారావు, ఏఎంసీ మాజి వైస్‌ చైర్మన్‌ కె.వీరయ్య, ప్రచార కార్యదర్శి రోసిరెడ్డి, జిల్లా పార్లమెంట్‌ కమిటీ సభ్యులు కె.యల్లయ్య, డివిజన్‌ కాపు నాయకులు ఎ.వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎల్‌.ప్రసాద్, టౌన్‌ అధ్యక్షులు జి.ఆంజనేయులు, సేవాదళ అధ్యక్షుడు సుందరరావు, నాయకులు సిద్ధనపాలెం సుబ్బయ్య, జానీకీరఘు, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, డిష్‌ వెంకటరెడ్డి, హనుమంతరావు, కోటిరెడ్డి, దేవదానం, కాశయ్య, హనుమంతరావు, జక్కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

పుల్లలచెరువులో బంద్‌  నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement