‘కేంద్రం అసమర్థతతోనే ప్రజలు కష్టాలు’
అనంతపురం సెంట్రల్ : పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, దీంతోనే ప్రజలకు కష్టాలని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. అనంతపురం పాతూరులోని గాంధీ విగ్రహం ఎదుట వ్యాపారుల ఇబ్బందులను బుధవారం ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాడిపత్రి బస్టాండ్‌లోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీసీ అధికార ప్రతినిధి రమణ, డీసీసీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, యువజన కాంగ్రెస్ నాయకులు జనార్దన్‌రెడ్డి, గోవర్దన్ పాల్గొన్నారు.