శైలజానాథ్కు ఎదురు దెబ్బ
మాజీ మంత్రి శైలజానాథ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదంలో ఉన్న భూమి కొనుగోలు చెల్లదంటూ అనంతపురంలోని రిజిస్ట్రేషన్ కోర్టు శనివారం శైలజానాథ్కు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం ఆదర్శనగర్లోని వివాదంలో ఉన్న భూమిని శైలజానాథ్ కొనుగోలు చేసి... రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈ నేపథ్యంలో వివాదంలో ఉన్న స్థలం రిజిస్ట్రేషన్ చెల్లదని బాధితుడు మంజునాథ్ నాయుడు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ అంశంపై కోర్టు విచారణ జరిపింది. మాజీ మంత్రి శైలజానాథ్ భూ కొనుగోలు చెల్లదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.