భూ వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది
భూ వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా లే పాక్షి మండలం సరిపురం గ్రామానికి చెందిన సోదరులు వీరభద్రప్ప, నాగరాజు, నర్సింహమూర్తిలకు మధ్య ఇంటి స్థలం వివాదం కొనసాగుతోంది. దీనిపై వారు మంగళవారం ఉదయం వాదులాడుకున్నారు. అదే సమయంలో నర్సింహమూర్తి కొడవలితో సోదరులపై దాడిచేసి, గాయపర్చాడు. క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు.