
వినోద మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
• ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
• పెద్ద నోట్లు చెల్లవని ఆత్మహత్య చేసుకుందన్న కుమారుడు
• డబ్బుల కోసం హత్య చేశారంటున్న మృతురాలి కూతుళ్లు
• 12 ఎకరాలు అమ్మగా కుటుంబానికి వచ్చిన రూ.54 లక్షలు
• ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడిన తల్లి
• కుటుంబ కలహాల వల్లే..: కలెక్టర్
• అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
సాక్షి, మహబూబాబాద్: ఆ కుటుంబం తమకున్న 12 ఎకరాల భూమిని అమ్ముకుంది.. రూ.54 లక్షలు వచ్చాయి.. ఈ డబ్బు ఎవరి ఖాతాలో వేయాలన్నదానిపై తల్లీ, కొడుకుల మధ్య గొడవ మొదలైంది.. ఇంతలో ఆ ఇంట్లో ‘పెద్ద నోట్ల’ రద్దుతో పిడుగు పడింది.. ఏమైందో ఏమోగానీ రాత్రికిరాత్రే తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇక చెల్లవన్న ఆందోళనతోనే తన తల్లి చనిపోరుుందని కొడుకు చెబుతుండగా.. సొమ్ము కోసం అతడే చంపేశాడని ఆమె కూతుళ్లు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని శనిగపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డబ్బులపై గొడవ
శనిగపురానికి చెందిన కందుకూరి ఉపేంద్ర చారి, వినోద(55) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యారుు. వీరికి ముడుపుగల్లు గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఈ ఏడాది జనవరిలో విక్రరుుంచగా రూ.56 లక్షలు వచ్చారుు. ఆ తర్వాత ఉపేంద్రాచారి అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం కొంత డబ్బును ఖర్చు చేశారు. మిగిలిన రూ.45.5 లక్షలతో దగ్గర్లో ఎక్కడైనా భూమి కొనుగోలు చేద్దామని డబ్బులను ఇంట్లోనే దాచుకున్నారు. ఈ డబ్బు విషయంపై కుమారుడు శ్రీనివాస్‌కు, ఉపేంద్రచారి, వినోద మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నారుు. భూమి డబ్బులను తమ పేరిట బ్యాంకులో ఉన్న జారుుంట్ అకౌంట్‌లో జమచేద్దామని ఉపేంద్రచారి, వినోద అంటుండగా.. తన అకౌంట్‌లోనే జమ చేసుకుంటానని కొడుకు గొడవ పడుతున్నాడు. ఈ డబ్బుల విషయమై వినోద తన కూతుళ్లతో ఫోన్‌లో మాట్లాడుతుండేది.
పెద్దనోట్ల రద్దుతో ముదిరిన లొల్లి
కేంద్రం రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేయడంతో ఉపేంద్రచారి కుటుంబంలో గొడవలు మరింత పెరిగారుు. భూమి అమ్మగానే డబ్బుల్ని బ్యాంక్‌లో జమ చేస్తే బాగుండు కదా అంటూ గొడవపడ్డారు. ఆ డబ్బులో కొంత కూతుళ్లకు కూడా ఇవ్వాలని వినోద పట్టు బట్టింది. వాళ్లకెందుకని శ్రీనివాస్.. తల్లి వినోదను నిలదీశాడు. ఈ గొడవలోనే ఆమెను బుధవారం రాత్రి ఇంట్లోంచి బయటకు నెట్టేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాత్రి ఉరేసుకొని చనిపోరుుంది. తాము ఒంటిగంట సమయంలో అలికిడికి లేచిచూసే సరికే చనిపోరుు కనిపించిందని శ్రీనివాస్ చెప్పాడు. గురువారం ఉదయం వినోద కూతుళ్లు వచ్చి తల్లిని శ్రీనివాసే హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు వినోద మృతదేహాన్ని మహబూబాబాద్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలు సోదరుడు ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ రూరల్ పోలీసులు అనుమానాస్పదం మృతిగా కేసు నమోదు చేశారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న భర్త
వినోద భర్త ఉపేంద్రకు ఏడాదిన్నర క్రితం బ్రెరుున్ స్ట్రోక్ వచ్చింది. ఆరు నెలల క్రితం రెండు కిడ్నీలు ఫెరుుల్ అయ్యారుు. ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతుంది. కుమారుడు శ్రీనివాస్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
మధ్యవర్తి వద్దకు డబ్బులు
తల్లి మృతిపై కుమారుడు శ్రీనివాస్, కూతుళ్లు శశికళ, మాధవి గొడవడ్డారు. డబ్బుల కోసమే తల్లిని శ్రీనివాస్, ఆయన భార్య హత్య చేశారని శశికళ, మాధవి పోలీసులకు చెప్పారు. దీంతో పెద్దమనుషుల పంచాయతీ తర్వాత బీరువా తాళాన్ని తెరిచి ఓ మధ్యవర్తి వద్ద డబ్బు ఉంచారు. ఇది హత్యా..? ఆత్మహత్యా..? అన్న అంశంపై పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే తేలుతుందని పోలీసులు అంటున్నారు.
డబ్బులపై చర్చించుకున్నాం
ఇంట్లో ఉన్న డబ్బులు చెల్లవనే విషయంపై అమ్మ, నేను, నాన్న చర్చించుకున్నాం. ఆ డబ్బులను ఎలా బ్యాంక్‌లో వేయాలని మాట్లాడుకున్నాం. కొద్దికొద్దిగా బ్యాంకులో వేద్దాం అని రాత్రి నిర్ణరుుంచుకున్నం. ఇంతలోనే అర్ధరాత్రి అమ్మ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
- శ్రీనివాస్, కుమారుడు
కుటుంబ కలహాల వల్లే..
వినోద కుటుంబ కలహాలతోనే మృతి చెందింది. కరెన్సీ మార్పిడి గురించి కాదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. - ప్రీతిమీనా, జిల్లా కలెక్టర్, మహబూబాబాద్