రైతు ఖాతా నుంచి రూ. 23 వేలు మాయం
Published Wed, Nov 23 2016 12:25 AM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM
గోనెగండ్ల: పెద్ద నోట్ల మార్పిడితో భయాందోళన చెందిన ఓ రైతు తన వద్ద ఉన్న నోట్లను బ్యాంకులో వేస్తే ఓ గుర్తు తెలియని వ్యక్తి దర్జాగా డ్రా చేసుకున్నాడు. బ్యాంక్ అధికారుల సమాచారంతో విషయం తెలుసుకున్న రైతు పోలీసులను ఆశ్రయించాడు.తిప్పనూరు గ్రామానికి చెందిన చాకలి రంగన్న ఇటీవల పత్తిని విక్రయించాడు. పెద్ద నోట్ల రద్దుతో హెచ్.కైరవాడి కెనరా బ్యాంక్‌లోని తన అకౌంట్ నెంబర్ 1816108007023కు ఈనెల 10వ తేదీన రూ.49వేలు, 12వ తేదీన రూ.11.500 జమ చేశాడు. అయితే ఆన్‌లైన్‌లో బెంగళూరు, గుర్గావ్ ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఏటీం కార్డుపై నంబరు తీసుకొని ఈనెల 17వ తేదీ నుంచి 19 వరకు బాధితుడి అకౌంట్‌లోని రూ.23,800తో ఆన్‌లైన్ షాపింగ్ చేశాడు. ప్రతి రోజు కొంత నగదు అకౌంట్ ద్వారా విత్ డ్రా అవుతుంటే బ్యాంక్ మేనేజర్ బాలచంద్ర గుర్తించి రైతును ఆరా తీశాడు. అయితే తాను నగదును విత్‌డ్రా చేయలేదని ఆ నగదు ఎలా డ్రా అవుతుందో తెలియదని రైతు చెప్పడంతో విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి మాయం చేసినట్లు తెలుసుకున్నారు. మేనేజర్ సూచన మేరకు రైతు రంగన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Advertisement