
అందుకోండి మొబైల్‌క్యాష్..
పీవోఎస్ పాయింట్లతో డబ్బులు చెల్లింపు
► ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సేవలు
► ఖాతాదారులకు ఆసరాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా
కరీంనగర్ బిజినెస్ :
పెద్దనోట్లు రద్దయినప్పటి నుంచి బ్యాంకుల ఎదుట బారెడు క్యూలైన్లు.. ఏటీఎంలలో గంటల్లోనే డబ్బులు నిండుకోవడంతో జనం పాట్లు అన్నీ ఇన్నీ కా వు. గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూసి మన వంతు వచ్చేసరికి నగదు ఖాళీ అరుుతే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డబ్బులు తీసుకుని బ్యాంకులు మన దగ్గరికే వస్తే ఎలా ఉం టుంది..! ఎడారిలో ఒయాసిస్ కనిపించి నంత సంబరం చేసుకుంటాం!! ప్రజల నగ దు కష్టాలను కొంతైనా తీర్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొబైల్‌క్యాష్ ఎట్ పీవోఎస్ పారుుంట్లు ఏర్పాటు చేశారు. స్టేబ్ బ్యాంక్ ఏటీఎం కార్డుదారులకు రూ.వెరుు్య అందిస్తున్నారు. ఆరు రోజులుగా పీవోఎస్ మిషన్ల ద్వారా నగరంలో సేవలు అందిస్తున్నారు. కరీంనగర్‌తోపాటు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఐదు కేంద్రాల ఈ సేవలందిస్తున్నట్లు ఎస్‌బీఐ ఆర్‌ఎం శోభ తెలిపారు. ఈ సేవలందుకున్న వినియోగదారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
అవసరాలు తీర్చుతున్నాయి..
బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు దొరక్క చాలా ఇబ్బందవుతుంది. నేను పనిమీద కరీంనగర్ వచ్చాను. ఎక్కడా పెద్దనోట్లు చెల్లడం లేదు. ఎస్‌బీఐ అందిస్తున్న ఈ సేవలు చాలా బాగున్నాయి. రద్దీగా ఉండే బస్టాండ్‌లో ఏర్పాటు చేయడంతో ప్రజలు అవసరాలు తీర్చుతున్నాయి. - విష్ణు, సిరిసిల్ల
ఏటీఎంలు ఖాళీ...
చిల్లర లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. ఖాతాల్లో నగదు డ్రా చేసుకుందామని అన్ని ఏటీఎంలు తిరిగినా ఎక్కడ డబ్బులు లేవు. చివరికి బస్టాండ్ వద్దకు రాగానే ఇది కనిపించింది. ఏంటని తెలుసుకుంటే డబ్బులు ఇస్తున్నామన్నారు. ఎక్కడ తిరిగినా డబ్బులు దొరకని పరిస్థితిలో మన వద్దకే ఇలా రావడం ఆశ్చర్యం కలిగించింది. - ఎండీ ఇలియాస్, కరీంనగర్
ఎస్‌బీఐ సేవలు అద్భుతం
మా ఊరు నుంచి కరీంనగర్‌కు పనిమీద వచ్చిన. కరీంనగర్ మొత్తం తిరిగినా ఏటీఎంలు ఎక్కడా పనిచేస్తలేవు. చివరికి బస్టాండ్‌కి వచ్చేసరికి ఎస్‌బీఐ వినియోగదారులకు డబ్బులిస్తున్నారు. పీవోఎస్ మిషన్‌తో ఏటీంఎం కార్డు ద్వారా రూ.వెరుు్య ఇచ్చారు . - అంజయ్య, గన్నేరువరం
ఖాతాదారులకు అండగా..
ఖాతాదారుల ఇబ్బందులు తొలగించి కొంతవరకు అండగా నిల్చేందుకే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నగరంలో అక్కడక్కడ మొబైల్ క్యాష్ ఎట్ పీవోఎస్ పారుుంట్ల తో ఏటీఎం కార్డు ద్వారా రూ.వెరుు్య నగదు చెల్లిస్తున్నాం. చా లా మంది వినియోగదారులు వినియోగించుకుంటున్నారు. - ఎం.శ్రీనివాసమూర్తి, మేనేజర్, ఎస్‌బీఐ (ఆర్‌బీవో, సీఎస్ అండ్ సీఎం)