నోట్లు నిండుకున్నాయ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పది రోజుల తర్వాత కూడా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల ముందు నగదు లేదన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు సైతం చాలావరకు మూతపడే ఉన్నాయి. వాటిలో పెడుతున్న నగదు గంటలోనే ఖాళీ అవుతోంది. వాటివద్ద కూడా ‘అవుటాఫ్ సర్వీస్’, ‘నో క్యాష్’ అనే బోర్డులు వేలాడుతున్నాయి. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో శుక్రవారం నాటికి రూ.100 నోట్లు దాదాపు నిండుకున్నాయి. చాలా బ్యాంకులు డిపాజిట్లు తీసుకోవడానికే పరిమితం అవుతున్నాయి. ‘నగదు నిండుకున్నందుకు చింతిస్తున్నా’మంటూ బ్యాంకుల ఎదుట బోర్డులు పెట్టి తలుపుల్ని మూసేస్తున్నారు.
నిఘా పెరిగింది
ప్రైవేటు బ్యాంకులు అప్పటికప్పుడు కొత్త ఖాతాలు తెరిచి నల్లధనాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటి లావాదేవీలపై ఇంటెలిజె¯Œ్స విభాగం నిఘా పెట్టింది. జ¯ŒSధ¯ŒS ఖాతాలతోపాటు రుణాలు చెల్లిస్తున్న డ్వాక్రా మహిళల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని బ్యాంకుల్లో జరిగే రోజువారీ లావాదేవీలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, ఖాతాల నుంచి తీసుకున్న సొమ్ముల వివరాలు, నోట్ల మార్పిడికి సంబంధించిన పూర్తి వివరాలు పంపాలని ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు ఆదేశాలొ చ్చాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన సీసీ పుటేజీ ఆర్‌బీఐకు అందజేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్టాఫీసు, బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేయడంతో.. వ్యక్తిగత ఖాతాల్లోని సొమ్ముల్ని ఏటీఎంల ద్వారా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. చాలామంది తమవద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడం తలకుమించిన భారంగా మారింది. దుకాణాల్లో రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు ససేమిరా అంటున్నారు. పలుచోట్ల కమీష¯ŒS తీసుకుని చిల్లర ఇస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని పేదలు, కూలీలు తమకు వేతనం రూపంలో ఇచ్చిన పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మార్కెటింగ్ శాఖ పెద్దనోట్లు తీసుకుని కూరగాయలు, కిరాణా దుకాణాలలో సరుకుల కొనుగోలుకు కూపన్లు ఇస్తామని ప్రకటించినా.. పూర్తిగా అందుబాటులోకి రాలేదు. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో కొనసాగకపోవడంతో అన్ని వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించింది. ఒక్క స్టేట్‌బ్యాంక్
ఆఫ్ ఇండియా ప్రధాన శాఖల్లో మాత్రమే నగదు నిల్వలు ఉంటుండగా, వాటి శాఖల్లో మాత్రం సొమ్ములు ఉండటం లేదు. దీంతో ఎస్‌బీఐ మెయి¯ŒS బ్రాంచిల వద్ద రద్దీ కనబడుతోంది. పాలకోడేరు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద శుక్రవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మేనేజర్ సరిగా సమాధానం చెప్పడం లేదంటూ ఖాతాదారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు.