రేపే లాస్ట్ డేట్ - మిగిలిన రూ.2000 నోట్ల పరిస్థితి ఏంటి? | RBI May Extend Deadline To Return Rs 2000 Notes | Sakshi
Sakshi News home page

RBI: రేపే లాస్ట్ డేట్ - మిగిలిన రూ.2000 నోట్ల పరిస్థితి ఏంటి?

Published Fri, Sep 29 2023 3:31 PM | Last Updated on Fri, Sep 29 2023 4:04 PM

RBI May Extend Deadline To Return Rs 2000 Notes - Sakshi

రూ. 2000 నోట్ల ఎక్స్‌చేంజ్ లేదా డిపాజిట్ కోసం ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు 93 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గడువు పొడిగిస్తుందా? లేదా అనే దానిపైన చాలా మందికి సందేహం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రెండు వేలు నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవడానికి 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు సుమారు నాలుగు నెలలు గడువు కల్పించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఈ గడువు రేపటితో ముగుస్తుంది. ఇప్పటికి కూడా వెనక్కి రావాల్సిన నోట్లు 7 శాతం ఉన్నాయని, దీని కోసం ఆర్‌బీఐ గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో

ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, ఇతర వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులో జమ చేయడానికి గడువు పొడిగించాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ గడువు అక్టోబర్ 31 వరకు పొడిగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 93 శాతం రెండు వేలు నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి సంబంధిత శాఖ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement