
మెనీ ప్రాబ్లమ్స్..!
• అన్నదాతలకు అందని ‘సహకారం’
• డీసీసీబీలో పాత నోట్ల మార్పిడి
• నిలిపివేతతో తంటాలు ఇబ్బందుల్లో రైతులు
కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. పెద్ద నోట్ల మార్పిడికి, ఖాతాలో ఉన్న డబ్బులు డ్రా చేసుకోవడానికి ప్రజలు తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద బారులుదీరాల్సిన పరిస్థితులు నెల కొన్నారుు.
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయలను రద్దు చేయడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఎనిమిదో రోజు బుధవారం కూడా నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరవ కముందే క్యూలో నిల్చుంటున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టినా గంటలోపే ఖాళీ అవుతున్నారుు. బ్యాంకుల్లో పెద్ద నోట్లు మార్పిడి చేస్తున్నప్పటికీ కేవలం రెండు వేల రూపాయల నోట్లు మాత్రమే ఇస్తుండడంతో చిల్లర కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, నల్లగొండ