దేశంలో చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించిన విషయం తెలిసిందే. గత మే నెల 19న ఈ నిర్ణయం ప్రకటించిన ఆర్బీఐ తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని కోరింది. ఇందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది.
ఇప్పటికే చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేశారు. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి జులై 31 వరకు సుమారు 88 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిసింది. వీటి విలువ రూ. 3.14 లక్షల కోట్లు. ఇంకా రూ. 0.42 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు వెనక్కి రావాల్సి ఉంది.
డిజిటల్ లోన్ గురించి తెలుసా? ఈ డాక్యుమెంట్లుంటే సులువుగా రుణం!
ఈ నేపథ్యంలో ఇంకా తమ వద్ద రూ.2000 నోట్లు ఉన్నవారు వెంటనే డిపాజిట్ చేయాలని ఆర్బీఐ కోరుతోంది. అయితే బ్యాంకులకు వెళ్లి నోట్లు డిపాజిట్ చేయలేనివారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సులువైన పరిష్కారంతో ముందుకొచ్చింది. అమెజాన్ కస్టమర్లు ఏదైనా క్యాష్ ఆన్ డెలివెరీ ఆర్డర్ చేసినప్పుడు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఆర్డర్ చేసిన వస్తువు ధరను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు.
నెలవారీ రూ. 50,000 గరిష్ట డిపాజిట్ పరిమితికి లోబడి అమెజాన్ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం ప్రత్యేకంగా కేవైసీ ధ్రువీకరించిన కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి నోట్లు మార్చుకునే ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా అవసరం. మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో అప్‌డేట్ చేసిన మొత్తాన్ని ఆన్‌లైన్ షాపింగ్, క్యూఆర్ ఆధారిత చెల్లింపులు, రీఛార్జ్‌లు, స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు.
అమెజాన్ పే వ్యాలెట్‌తో నోట్లు మార్చుకోండిలా..
- అమెజాన్ యాప్‌లో వీడియో కేవైసీని పూర్తి చేయండి.
- క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేయండి.
- డెలివరీ ఏజెంట్‌కు రూ.2000 నోట్లు ఇవ్వండి
- ఏజెంట్ మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ని తక్షణమే అప్‌డేట్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment