cash on delivery
-
రూ. 2,000 నోట్లు ఇంకా ఉన్నాయా? ఈజీగా ఇలా మార్చుకోండి..
దేశంలో చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించిన విషయం తెలిసిందే. గత మే నెల 19న ఈ నిర్ణయం ప్రకటించిన ఆర్బీఐ తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని కోరింది. ఇందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేశారు. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి జులై 31 వరకు సుమారు 88 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిసింది. వీటి విలువ రూ. 3.14 లక్షల కోట్లు. ఇంకా రూ. 0.42 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. డిజిటల్ లోన్ గురించి తెలుసా? ఈ డాక్యుమెంట్లుంటే సులువుగా రుణం! ఈ నేపథ్యంలో ఇంకా తమ వద్ద రూ.2000 నోట్లు ఉన్నవారు వెంటనే డిపాజిట్ చేయాలని ఆర్బీఐ కోరుతోంది. అయితే బ్యాంకులకు వెళ్లి నోట్లు డిపాజిట్ చేయలేనివారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సులువైన పరిష్కారంతో ముందుకొచ్చింది. అమెజాన్ కస్టమర్లు ఏదైనా క్యాష్ ఆన్ డెలివెరీ ఆర్డర్ చేసినప్పుడు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఆర్డర్ చేసిన వస్తువు ధరను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. నెలవారీ రూ. 50,000 గరిష్ట డిపాజిట్ పరిమితికి లోబడి అమెజాన్ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం ప్రత్యేకంగా కేవైసీ ధ్రువీకరించిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి నోట్లు మార్చుకునే ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా అవసరం. మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో అప్డేట్ చేసిన మొత్తాన్ని ఆన్లైన్ షాపింగ్, క్యూఆర్ ఆధారిత చెల్లింపులు, రీఛార్జ్‌లు, స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు. అమెజాన్ పే వ్యాలెట్‌తో నోట్లు మార్చుకోండిలా.. అమెజాన్ యాప్‌లో వీడియో కేవైసీని పూర్తి చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేయండి. డెలివరీ ఏజెంట్‌కు రూ.2000 నోట్లు ఇవ్వండి ఏజెంట్ మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ని తక్షణమే అప్డేట్ చేస్తారు. -
జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా!
మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? ఆర్డర్ పెట్టిన ఫుడ్‌కు ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారా? లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటున్నారా? చేస్తే చేశారు కానీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి. సీవోడీ పద్దతిలోనే డబ్బులు చెల్లించండి. ఫుడ్ డెలివరీ సంస్థల్ని మోసం చేసి వందల రూపాయిల్ని మీరు ఆదా చేసుకోవచ్చు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఫుడ్ ఆగ్రిగేటర్‌కు చెందిన డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీతో డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవచ్చో కస్టమర్లకు చెబుతున్నాడు. అందులో ఓ కస్టమర్ డెలివరీ బాయ్ చేస్తున్న ప్రచారం గురించి నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట్లో వైరల్‌గా కాగా.. సదరు కంపెనీ సీఈవో స్పందించారు. సంస్థలోని లోపాల్ని సరిదిద్దుతామని తెలిపారు. ఉత్తరాఖండ్ చెందిన ఎంట్రప్రెన్యూర్ వినయ్ సతి కొద్దిరోజుల క్రితం జొమాటోలో బర్గర్స్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన 30 నిమిషాల తర్వాత బర్గర్స్ తెచ్చిన ఆ డెలివరీ బాయ్.. వినయ్‌తో.. ‘ సార్ నెక్ట్స్ టైం నుంచి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ చేయండి. ఎందుకుంటే? మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఖరీదు రూ.700 నుంచి రూ.800 ఉంటే.. క్యాష్ ఆన్ డెలివరీలో కేవలం రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. మీరు నాకు రూ.200, రూ.300 ఇచ్చి రూ.1000 ఖరీదైన ఫుడ్‌ను ఆస్వాధిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ సెలవిచ్చాడు. దీంతో షాక్ తిన్న వినయ్ తనకు ఎదురైన అనుభవాన్ని లింక్డిఇన్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో...జొమాటోలోని డెలివరీ బాయ్స్ భారీగా మోసం చేస్తున్నారని, ఎలా మోసం చేయాలో సలహా ఇచ్చారని, జొమాటోలో స్కామ్ జరుగుతోందని విని నాకు గూస్బంప్స్ వచ్చాయి. ఇక, జొమాటో డెలివరీ బాయ్ చెప్పినట్లు ఆఫర్‌ను ఎంజాయ్ చేయాలా? లేదంటే మోసాన్ని బహిర్ఘతం చేయాలా? అని ప్రశ్నించారు. నేను ఎంట్రప్రెన్యూర్‌ను కాబట్టి సెకండ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నా. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా.. ఆ పోస్ట్ పై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం : వినయ్ సతి ప్రతీకాత్మక చిత్రం : వినయ్ సతి పోస్ట్‌పై జొమాటో సీఈవో స్పందన చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
‘ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు భారీ షాక్’
దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు షాకిచ్చింది. ‘క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ)’ ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. దీంతో ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్, వెబ్సైట్ల నుంచి బుక్ చేసిన కొనుగోలు దారులపై ఈ అదనపు ఛార్జీల భారం పడనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం సంబంధిత ప్రొడక్ట్‌లపై డెలివరీ ఛార్జీలను వసూలు చేసేది. ఏదైనా రూ.500 లోపు వస్తువుల్ని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి బుక్ చేసుకుంటే వాటిపై రూ.40 డెలివరీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 మించిన ప్రొడక్ట్ ధరపై ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని ప్లిప్‌కార్ట్ తన వెబ్ సైట్లో పేర్కొంది. కానీ ఇప్పుడు డెలివరీ ఛార్జీలను ఎత్తివేసింది. వాటికి బదులు సీఓడీ సౌకర్యం కావాలనుకున్న కస్టమర్ల నుంచి మినిమం ఛార్జీ రూ.5 వసూలు చేస్తుంది. చదవండి👉 నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్‌కు భారీ ఫైన్! పెరిగిపోతున్న నెట్‌లాస్ ఆర్ధిక సంవత్సరం 2021-2022లో ప్లిప్‌కార్ట్ వృద్ధి రేటు రూ.10,659 కోట్లుగా ఉంది. అదే సమయంలో గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే మార్చి 2022 ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి నెట్ లాస్ రూ.4,362 కోట్లుగా ఉంది. అయితే ఆ నష్టాలకు కారణం పెరిగిపోతున్న రవాణా , మార్కెటింగ్, లీగల్ ఎక్సెపెన్సెస్ అని ప్లిప్‌కార్ట్ ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ -
ఫోన్‌పే కస్టమర్లకు గుడ్‌న్యూస్.. క్షణాల్లో డెలివరీ పేమెంట్ చెల్లింపు
డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పే-ఆన్-డెలివరీ ఆర్డర్ల కోసం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా "క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకున్న వినియోగదారులు ప్రొడక్ట్ డెలివరీ సమయంలో ఫోన్ పే యుపీఐ ద్వారా డిజిటల్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది" అని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో యూజర్ల వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫోన్ పే బిజినెస్ డైరెక్టర్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ.. "డిజిటల్ చెల్లింపుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా యుపీఐ యాప్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నందుకు ధన్యవాదాలు. డెలివరీ సమయంలో కొంతమంది కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీ చేయడంతో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ నగదు ఆధారిత చెల్లింపులను డిజిటైజ్ చేయడం కేవలం ఈ-కామర్స్‌కు మాత్రమే కాకుండా డిజిటల్ ఇండియా పెద్ద లక్ష్యానికి దోహదపడుతుంది" అని అన్నారు. ఈ ఒప్పందం వల్ల ఫ్లిప్‌కార్ట్ క్యాష్ ఆన్ డెలివరీ సమయంలో కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చేయడం కొరకు కస్టమర్లు ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలామంది కస్టమర్లు తమ అవసరాల కోసం ఆన్లైన్ షాపింగ్‌కు మారారని, పే ఆన్ డెలివరీ ఎంచుకునే కస్టమర్లకు పేమెంట్ సమయంలో మనశ్శాంతితో ఇకనుంచి పేమెంట్స్ చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్‌లో ఫిన్‌టెక్ అండ్ గ్రూప్ హెడ్ రంజిత్ బోయనపల్లి అన్నారు. -
క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు
హైదరాబాద్: క్యూఆర్ కోడ్ ఆధారంగా నగదు చెల్లించే విధానాన్ని ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ అమల్లోకి తెచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువు కవర్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కస్టమర్లు డిజిటల్ పేమెంట్ చేయోచ్చు. పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూపీఐ యాప్‌ను వినియోగించవచ్చు. చెల్లింపుల విషయంలో క్యూఆర్ కోడ్ విధానంతో వినియోగదార్లలో విశ్వాసం పెరుగుతుందని వివరించింది. సీఓడీ ఆప్షన్‌తో కరోనా కారణంగా టచ్ తగ్గించడం ప్రధానంగా మారింది. అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు నగదు చెల్లింపు కొంత రిస్క్‌గా మారింది. దీంతో సీఓడీ ఆప్షన్లో క్యూఆర్ కోడ్ పేమెంట్ ఆప్షన్ని ఫ్లిప్‌కార్ట్ అమల్లోకి తెచ్చింది. -
మెరుగైన సేవలే తపాలా శాఖ లక్ష్యం
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తపాలా శాఖ లక్ష్యమని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని పోస్టుమాస్టర్లు, సబ్ పోస్టుమాస్టర్లు, సూపర్వైజర్లకు ఆదివారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయ మేడపైన క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) అంశంపై శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు అతిథిగా హాజరై పోస్టుమాస్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీతో పాటు ఇటీవల గ్రామీణ పోస్టాఫీసుల్లో ప్రవేశపెట్టిన ఆర్‌ఐసీటీ ప్రాజెక్టు గురించి వివరించారు. మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ (ఎంఎన్ఓపీ) అంశంపై పవర్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.నాగానాయక్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ ఫజులుర్ రహ్మాన్, ట్రైనర్ అబ్దుల్ హక్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు తగ్గాయ్
30 శాతం వరకు క్షీణత కరెన్సీ నోట్ల రద్దే కారణం న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలకు వచ్చే క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆర్డర్లు తగ్గారుు. దాదాపు 30 శాతం వరకు క్షీణించారుు. సీవోడీలు తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వపు నిర్ణయాన్ని ఆయా ఈ-కామర్స్ ఆహ్వానించడం విశేషం. నోట్ల రద్దు చర్య దీర్ఘకాలంలో పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారుు. ‘కరెన్సీ నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పుడు అమ్మకాలు తగ్గారుు. కానీ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. అర్డర్లు క్రమంగా పెరగుతున్నారుు’ అని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ తెలిపారు. సీవోడీ ఆర్డర్లు దాదాపు 30 శాతానికి తగ్గాయని స్నాప్‌డీల్ సహ వ్యవస్థపకుడు కూనల్ భల్ పేర్కొన్నారు. తమ సీవోడీ ఆర్డర్లు 15 శాతంమేర క్షీణించాయని షాప్‌క్లూస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్ సేథి తెలిపారు. 30 శాతానికి ఆర్డర్లు: మొత్తం విక్రయాల్లో సీవోడీ ఆర్డర్లు 30%కి తగ్గాయని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కూనల్ భల్ పేర్కొన్నారు. ‘క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు ఒకానొక సందర్భంలో సంస్థ మొత్తం అమ్మకాల్లో 70%కి చేరారుు. ఇవి తర్వాత 50%కి పడ్డారుు. కానీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఆర్డర్లు ఒక్కసారిగా దాదాపు 30%కి క్షీణించారుు. ఇప్పుడు అరుుతే స్వల్పంగా పెరిగారుు. ఆర్డర్లు త్వరలోనే యథాస్థారుుకి చేరుతాయని భావిస్తున్నాం’ అని వివరించారు. సేవలు యథాతథం: కరెన్సీ నోట్ల రద్దు ప్రకటన అనంతరం అమెజాన్, పేటీఎం వంటి సంస్థలు వాటి సీవోడీ ఆర్డర్లను సగానికి కుదించుకున్నారుు. ఇక ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలు ఆర్డర్ల విలువపై పరిమితులను విధించారుు. అరుుతే ఇప్పుడు అమెజాన్ వాటి సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ అరుుతే బుధవారం నుంచి తన సేవలను పూర్తిగా పునరుద్ధరించింది. ధీమాగా వాలెట్ సంస్థలు: పేటీఎం, ఫ్రీచార్జ్, మోబిక్విక్ వంటి మొబైల్ వాలెట్ సంస్థలు రానున్న రోజుల్లో వారి యూజర్ల సంఖ్యతోపాటు లావాదేవీలు కూడా బాగా పెరుగుతాయని ధీమాగా ఉన్నారుు. ఫ్రీచార్జ్ లావాదేవీ లు గణనీయంగా ఎగశాయని కూనల్ తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ పెరుగుదల వల్ల ఈ-కామర్స్ సం స్థలకు దీర్ఘకాలంలో లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది వారి చెల్లింపుల కోసం డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ఎంచుకుంటున్నారని బన్సాల్ తెలిపారు. -
సీవోడీ లావాదేవీలు తగ్గాయ్: స్నాప్‌డీల్
కోల్‌కతా: కరెన్సీ నోట్ల రద్దు వల్ల క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పేమెంట్స్‌పై ప్రతికూల ప్రభావం పడిందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ సహవ్యవస్థాపకుడు కూనల్ భల్ తెలిపారు. ఈ-కామర్స్ సంస్థల మొత్తం లావాదేవీల్లో సీవోడీ వాటా 70% వరకు ఉంటుందని, ప్రస్తుతం దీనిలో కొంత క్షీణత నమోదరుు్యందన్నారు. ఈ తగ్గుదల పాక్షికమని, మళ్లీ సీవోడీ బిజినెస్ యథాస్థితికి చేరుతుందని తెలిపారు. నోట్ల రద్ద వల్ల ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు తొలి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని, తద్వారా దీర్ఘకాలంలో ఈ-కామర్స్ పరిశ్రమ కార్యకలాపాలు సులభతరం అవుతాయని భల్ తెలిపారు. -
ట్రైన్ టిక్కెట్ మీ ఇంటికే...
న్యూఢిల్లీ : రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక రైలు టిక్కెట్ మీ ఇంటి వద్దకే అందించే సౌలభ్యాన్ని రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది. క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) విధానం ద్వారా మీ ఇంటి వద్దే డబ్బు చెల్లించి టిక్కెట్ పొందవచ్చు. ఇప్పటివరకూ ఆన్లైన్లో ఐఆర్సీటీసీ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు వెంటనే నగదు చెల్లించే విధానం అమల్లో ఉంది. ప్రయాణికులు క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే క్రెడిట్, డెబిట్ కార్డుల మోసాలు ఎక్కువ కావటంతో ప్రయాణికులు ఆ కార్డులను ఉపయోగించుకునేందుకు ఇష్టపడటం లేనందున ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముందుగా 200 నగరాల్లో క్యాష్ ఆన్ డెలివరీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు అయిదు రోజులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే టిక్కెట్ క్యాష్ ఆన్ డెలివరీ సమయంలో స్లీపర్ క్లాస్‌కు రూ.40, ఏసీ క్లాస్‌కు రూ.60 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా టిక్కెట్ల కోసం బుకింగ్ కౌంటర్ల దగ్గర పడిగాపులు కాచే ప్రయాణికులకు ఇది శుభవార్తే. అదనంగా డబ్బు చెల్లించినా... టిక్కెట్ల తిప్పులు తప్పినట్లే.