మెరుగైన సేవలే తపాలా శాఖ లక్ష్యం
మెరుగైన సేవలే తపాలా శాఖ లక్ష్యం
Published Mon, Apr 24 2017 12:29 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తపాలా శాఖ లక్ష్యమని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని పోస్టుమాస్టర్లు, సబ్ పోస్టుమాస్టర్లు, సూపర్‌వైజర్లకు ఆదివారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయ మేడపైన క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) అంశంపై శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు అతిథిగా హాజరై పోస్టుమాస్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీతో పాటు ఇటీవల గ్రామీణ పోస్టాఫీసుల్లో ప్రవేశపెట్టిన ఆర్‌ఐసీటీ ప్రాజెక్టు గురించి వివరించారు. మెయిల్ నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్ (ఎంఎన్‌ఓపీ) అంశంపై పవర్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.నాగానాయక్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ ఫజులుర్ రహ్మాన్, ట్రైనర్ అబ్దుల్ హక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement