పోస్టల్‌సేవలను సది్వనియోగం చేసుకోవాలి
పోస్టల్‌సేవలను సది్వనియోగం చేసుకోవాలి
Published Mon, Oct 10 2016 12:09 AM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM
– జిల్లా అదనపు సివిల్ జడ్జి పుష్పారాణి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టాఫీసులు అందిస్తున్న సేవలను ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని జిల్లా అదనపు సివిల్ జడ్జి పుష్పారాణి పేర్కొన్నారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు మేడపై ఉన్న పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు అధ్యక్షతన ఆదివారం ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు సివిల్ జడ్జి పుష్పారాణితో పాటు డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ సంతాన రామన్ అతిథులుగా హాజరై మెరుగైన సేవలు అందించిన పది మంది పోస్టల్ సిబ్బందికి బహుమతులు అందించారు. సుకన్య సమృద్ధి యోజనకు దరఖాస్తు చేసుకున్న ఐదుగురు చిన్నారులకు ఖాతాలకు సంబంధించిన పాస్‌బుక్‌లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా అదనపు సివిల్ జడ్జి మాట్లాడుతూ పోస్టాఫీసులు సాంకేతిక పరిజ్ఙానాన్ని పెంపొందించుకుంటూ ఆధునిక బ్యాంకింగ్ దిశగా పయనిస్తున్నాయని పేర్కొన్నారు. పోస్టల్ శాఖ బలోపేతంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ సంతాన రామన్ మాట్లాడుతూ తపాలా వ్యవస్థకు 150 ఏళ్ల చరిత్ర ఉందని, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, మారుతున్న కాలనికి అనుగుణంగా టెక్నాలజీ పెంచుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు నాగానాయక్, సిబ్బంది లలిత, గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement