
నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
రూ.32,93,500 స్వాధీనం
జగిత్యాల: కోరుట్లలో నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అనంతశర్మ తెలిపారు. మంగళవారం జగిత్యాల డీపీవో కార్యాలయంలో విలేకరు ల సమావేశంలో నోట్ల మార్పిడి ముఠా వివరాలు వెల్లడించారు. చింత మోహన్ (కోరుట్ల), మహ్మద్ ఇలాయత్ (పెర్కిట్), బాజిరెడ్డి (నిజామాబాద్)లు కొంతకాలంగా కోరుట్లలో నోట్ల మార్పిడి దందా నడిపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో వీరు ఏపీ 15 ఏక్యూ 0992 నంబరు గల జైలో వాహనంలో వెళ్తుండగా సీఐ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో మంగళవారం కోరుట్ల లిమ్రా దాబా వద్ద పట్టుకున్నారు.
వీరు రూ.32,93,500 కలిగి ఉన్నారని, ఆ డబ్బుకు ఎలాంటి లెక్కలు లేవని తెలిపారు. దీంతో తాము ఇన్‌కంట్యాక్స్ అధికారులకు సమాచారం అందించామన్నారు. ఇందులో సుమారు రూ.3 లక్షల విలువ గల విదేశీ కరెన్సీతోపాటు కొత్త రూ.20 వేల వరకు కొత్త రూ.2 వేల నోట్లు, మిగతావి పాత రూ.500, రూ.వెరుు్య నోట్లు ఉన్నాయన్నారు. వీరు 20-30 పర్సంటేజీతో దందా నడుపుతున్నట్లు తెలిసిందన్నారు. కాగా, ఈ ముఠాను పట్టుకున్న కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్‌ఐ కృష్ణకుమార్‌లను ఉన్నతాధికారులు, ఎస్పీ అనంతశర్మ అభినందించారు.