
పేదోళ్ల చుట్టూ బడాబాబుల చక్కర్లు
• కూలీ ఇచ్చి క్యూలో నిలబెడుతున్న బడాబాబులు
• అటవీ గ్రామాల్లో జోరుగా కమీషన్ దందా
• నోట్ల మార్పిడికి కాంట్రాక్టర్లు, స్మగ్లర్లపై మావోయిస్టుల ఒత్తిడి
మహదేవపూర్: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అక్రమంగా సంపాదించి దాచుకున్న రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి కోసం బడా బాబులు పేదోళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రూ.300 కూలీ ఇచ్చి మరీ బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద క్యూలైన్‌న్లలో నిలబెడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లోని అటవీ గ్రామాల ప్రజలతో పెద్దనోట్లు మార్పిడి చేరుుంచడానికి కలప స్మగ్లర్లు, గుడుంబా వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న రూ.500, 1000 నోట్లను అటవీ గ్రామాల్లోని పేదలకు ఇచ్చి మహారాష్ట్రలో, తెలంగాణలోని బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద మార్పిడి చేరుుస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఒక్కొక్కరికి రూ.300 కూలీ కూడా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
కొంతమంది దళారులు అటవీ గ్రామాల్లోని ఆదివాసీ, గిరిజనులు, దళితుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రూ.500లకు రూ.450, రూ.1000 నోటుకు రూ.900లు ఇస్తున్నారు. కొందరు వ్యాపారులు 10 శాతం కమీషన్‌న్‌కు పెద్ద నోట్లు మార్పిడి చేస్తున్నారు. ఇదే అదనుగా మావోరుుస్టులు పెద్ద నోట్లను మార్చుకునేందుకు స్మగ్లర్లు, ఇసుక మాఫియా, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
మావోరుుస్టులకు తిప్పలే!
పెద్దనోట్లు రద్దుతో డంపుల కోసం అన్వేషించే ముఠాల సంచారం తగ్గిపోరుుందని చర్చ జరుగుతోంది. కలప స్మగ్లింగ్, గుడుంబా తయారీ, మహారాష్ట్రకు రవాణా చేసేందుకు సహకరించే నిరుపేదలు పెద్ద నోట్లను అంగీకరించకపోవడంతో తాత్కాలికంగా అక్రమ రవాణాకు బ్రేకు పడింది. పెద్దనోట్లు మార్చుకురావాలని సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను మండల కేంద్రాలకు, పట్టణ ప్రాంతాలకు పంపుతున్నట్లు సమాచారం. పలిమెల మండలానికి చెందిన ఒక యువకుడు సుమారు రూ.40లక్షల పెద్ద నోట్లు మార్పిడి చేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు పుకార్లు షికారు చేస్తున్నారుు. అధికార పార్టీ నాయకులు పెద్దనోట్ల మార్పిడికి బ్యాంక్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
పెళ్లికీ నిబంధనలా..?
నిజామాబాద్ పట్టణంలో ఆర్యనగర్ బ్యాంక్ కాలనీకి చెందిన మోహన్ ఎఫ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగి. ఆయన కుమార్తె గాయత్రిదేవికి డిసెంబర్ 3న పెళ్లి జరగాల్సి ఉంది. ఆయనకు రిటైర్‌మెంట్ తర్వాత వచ్చిన డబ్బును ఇక్కడి గోదాం రోడ్డులోని ఎస్‌బీఐ ఖాతాలో ఈ నెల 8వ తేదీ తర్వాత జమ చేసుకున్నారు. కుమార్తె వివాహం కోసం ఆ డబ్బు డ్రా చేసుకునేందుకు గురువారం శుభలేఖ, ఇతర ఆధారాలు తీసుకుని బ్యాంకుకు వచ్చారు. అరుుతే ఈ నెల 8 కంటే ముందు ఖాతాలో ఉన్న డబ్బులు మాత్రమే వివాహాల కోసం ఇవ్వాలన్న ఆర్‌బీఐ నిబంధనలు అడ్డంకిగా మారారుు. దాంతో ఖాతాలోని డబ్బు ఇవ్వలేమని బ్యాంకు మేనేజర్ స్పష్టం చేశారు. ఎలాగైనా డబ్బు ఇప్పించాలని వేడుకున్నా ఫలితం లేకపోరుుంది. దీంతో గత్యంతరం లేక రూ.24 వేలు డ్రా చేసుకుని కన్నీటితో తిరిగి వెళ్లిపోయారు.