
ముంబై: బ్యాంకులు ఏప్రిల్ 1వ తేదీ సోమవారం పనిచేయవు. మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి (2018–19) సంబంధించి ఖాతాల ముగింపును (యాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్) పురస్కరించుకుని వాణిజ్య, సహకార బ్యాంకులు పనిచేయవని ఆర్‌బీఐ పేర్కొంది.
ప్రభుత్వ లావాదేవీలకు ఆదివారం సేవలు
కాగా ఆర్థిక సంవత్సరం చివరిరోజుకావడంతో (మార్చి 31) ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లకు అలాగే చెల్లింపుల లావాదేవీల నిర్వహణకు సంబంధిత ప్రత్యేక బ్యాంక్ బ్రాంచీలు పనిచేస్తాయి. ‘‘పే అండ్ అకౌంట్ బ్యాంక్ బ్రాంచీలు అన్నీ మార్చి 31న పనిచేయలని కేంద్రం సూచించింది’’ అని ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఆర్‌టీజీఎస్, నిఫ్ట్ వంటి అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీ సమయాలు ఇందుకు అనుగుణంగా పొడిగించడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment